ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: దేశానికి వ్యతిరేకంగా విపక్షాల కుట్రను ఎండగట్టాలి

ABN, Publish Date - Nov 29 , 2024 | 09:21 PM

అధికారం తమ జన్మహక్కుగా భావిస్తూ వచ్చిన వాళ్లు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమయ్యారని, తమను కాకుండా వేరేవారికి ప్రజలు ఆశీర్విదించడం గిట్టక మొదటి రోజు నుంచే ప్రజలపై కన్నెర్ర చేశారని విపక్షాలకు చురకలు వేశారు.

భువనేశ్వర్: కాంగ్రెస్, విపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విరుచుకుపడ్డారు. అధికారం తమ జన్మహక్కుగా భావిస్తూ వచ్చిన వాళ్లు పదేళ్లుగా అధికారం దక్కలేదన్న ఆక్రోశంతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఒడిశా (Odisha)రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారంనాడు జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా తాను భిన్న రాజకీయాలను చూశానని, రాజకీయాల్లో విధాన పరమైన వ్యతిరేకతలు సహజమేనని అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా భిన్నాభిప్రాయాలు ఉంటాయని, రాజకీయ పార్టీలు ఉద్యమాల ద్వారా తమ సందేశాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్తుంటారని అన్నారు. అయితే అవన్నీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పరిధిలోకి ఉండాలన్నారు.

Gautam Adani: అదానీకి యూఎస్ సమన్లపై విదేశాంగ శాఖ క్లారిటీ


కొద్దికాలంగా చాలా మార్పు వచ్చింది

గత కొద్దికాలంగా చాలా పెద్ద మార్పు రావడం అంతా చూసే ఉంటారని, భారత రాజ్యంగ స్ఫూర్తిని అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని మోదీ అన్నారు. ప్రజాసామ్య విధివిధానాలకు తిలోదకాలు ఇస్తున్నారని అన్నారు. అధికారం తమ జన్మహక్కుగా భావిస్తూ వచ్చిన వాళ్లు పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమయ్యారని, తమను కాకుండా వేరేవారికి ప్రజలు ఆశీర్విదించడం గిట్టక మొదటి రోజు నుంచే ప్రజలపై కన్నెర్ర చేశారని విపక్షాలకు చురకలు వేశారు.


అబద్ధాల దుకాణం 50 ఏళ్లకు పైగా నడుపుతున్నారు

అధికారం దక్కలేదనే ఆగ్రహంతో దేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలపై ఆగ్రహంతో దేశాన్ని తప్పదారి పట్టించి తప్పుడు మార్గంవైపు నెడుతున్నాయని అన్నారు. ''వాళ్ల అబద్ధాల దుకాణాన్ని 50-60 ఏళ్లుగా నడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, దేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ జాగృతమై వారిని ఎదుర్కోవాలి. ఇది ఒక పెను సవాలు. ఆ దృష్ట్యా ప్రతి క్షణం అందరూ అప్రమత్తంగా ఉంటూ, ప్రజలను జాగృతం చేస్తూ, విపక్షాల అబద్ధాలను బహిర్గతం చేయాలని దేశప్రజలను కోరుతున్నాను'' అని మోదీ అన్నారు.


ఇవి కూడా చదవండి

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం

Maharashtra: కొనసాగుతున్న సస్పెన్స్.. కీలక సమావేశం రద్దు, సొంత గ్రామానికి షిండే

Karnataka: ముస్లింల ఓటు హక్కుపై వివాదం.. విశ్వ ఒక్కలిగ మహాసంస్థాన మఠం స్వామీజీపై కేసు

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

Updated Date - Nov 29 , 2024 | 09:21 PM