ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Notices To Ex MPs: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు

ABN, Publish Date - Jul 16 , 2024 | 05:04 PM

సార్వత్రిక ఎన్నికల ముగిశాయి. లోక్‌సభలో సభ్యులు ప్రమాణం సైతం పూర్తయింది. అయితే తాజా ఎంపీలకు అధికారిక బంగ్లాలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది.

న్యూఢిల్లీ, జులై 16: సార్వత్రిక ఎన్నికల ముగిశాయి. లోక్‌సభలో సభ్యులు ప్రమాణం సైతం పూర్తయింది. అయితే తాజా ఎంపీలకు అధికారిక బంగ్లాలను ప్రభుత్వం కేటాయించాల్సి ఉంది. ఆ క్రమంలో మాజీలుగా మారిన ఎంపీలు.. తమ అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో లుటియన్స్‌లో కేటాయించిన అధికారిక బంగ్లాలు వెంటనే ఖాళీ చేయాలని దాదాపు 200 మందిపైగా మాజీ ఎంపీలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. మరికొంత మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉందని పేర్కొంది.

Also Read:Doda encounter: ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Also Read: Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తమకు కేటాయించిన అధికారిక బంగ్లాలు ఖాళీ చేయల్సిందేనని మాజీ ఎంపీలకు ఈ సందర్బంగా సదరు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఓ వేళ ఖాళీ చేయకుంటే.. వారిని బలవంతంగానైనా ఖాళీ చేయిస్తామని హెచ్చరించింది. అసలు అయితే లోక్‌సభ రద్దయిన నెల రోజుల లోపు ఎంపీలంతా.. తమకు కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉందని పేర్కొంది.

Also Read: Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

Also Read: justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం


లోక్‌సభలో ఎంపీలతోపాటు కేంద్ర మంత్రులకు సైతం అధికారిక బంగ్లాలు కేటాయించాల్సిన బాధ్యత కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖదేనని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోపు మాజీ ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలని లేకుంటే... తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

మరోవైపు ఏ కేంద్ర మాజీ మంత్రికి బంగ్లా ఖాళీ చేయాలని తాము నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. అయితే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ.. అమేఠీ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె ఇటీవల తన అధికారిక బంగ్లాను సైతం ఖాళీ చేశారని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 05:04 PM

Advertising
Advertising
<