ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓబీసీ క్రీమీలేయర్‌లో ‘జీతం’ లెక్కించాలా?

ABN, Publish Date - Nov 16 , 2024 | 04:23 AM

సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఓబీసీ క్రీమీలేయర్‌ విధానాన్ని అమలుచేయడంలో వారి తల్లిదండ్రుల ‘వేతనాన్ని’ పరిగణనలోకి తీసుకునే విషయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

  • ప్రభుత్వరంగ సంస్థల సిబ్బందికీ వర్తింపజేయాలా?

  • పార్లమెంటరీ స్థాయీ సంఘంలో చర్చ

న్యూఢిల్లీ, నవంబరు 15: సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఓబీసీ క్రీమీలేయర్‌ విధానాన్ని అమలుచేయడంలో వారి తల్లిదండ్రుల ‘వేతనాన్ని’ పరిగణనలోకి తీసుకునే విషయంలో పార్లమెంటరీ స్థాయీ సంఘంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఈ నెల 28వ తేదీకి సమావేశం వాయిదా పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎ్‌సయూ) పనిచేస్తున్న ఓబీసీ వర్గం తల్లిదండ్రుల పిల్లల విషయంలో ఈ సమస్య తలెత్తింది. తల్లిదండ్రుల ఆదాయాన్ని బట్టి ఓబీసీ క్రీమీలేయర్‌ను సహజంగా నిర్ణయిస్తారు. ఒకవేళ ఆదాయం రూ. 8 లక్షలు మించితే వారి పిల్లలకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కూడా వర్తింపజేయాలని ఇటీవల సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల ఆదాయాన్ని లెక్కించడంలోనూ ‘వేతనాన్ని’ పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని ఓబీసీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రస్తుతం పరిశీలిస్తోంది. ఇందుకోసం వచ్చే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం ఉన్నతాధికారులకు నోటీసులు జారీచేసింది. అయితే, పీఎ్‌సయూలకూ ‘వేతన’ ప్రమాణాన్ని వర్తింపజేసే ప్రతిపాదనను విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు. పీఎ్‌సయూల్లో పనిచేస్తున్న ఓబీసీ కేటగిరి సిబ్బంది వేతనం, వ్యవసాయం ద్వారా వారికి లభించే లాభాలను.. ఆదాయంగా పరిగణించరాదని 1993 ఆఫీస్‌ మెమొరండంలో స్పష్టంగా ఉన్నదని, కానీ, దానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆక్షేపించారు. ఈ కారణంగా అనేకమంది ఓబీసీ అభ్యర్థులు గ్రూపు ఏ,బీ,సీ,డీ పోస్టులకు అనర్హులు అవుతున్నారన్నారు. అయితే, ఐదేళ్ల క్రితం ఇదే అంశం చర్చకు వచ్చినప్పుడు దానిని స్థాయీ సంఘం తిరస్కరించింది. అప్పుడు స్థాయీ సంఘానికి నేతృత్వం వహించిన బీజేపీ ఎంపీ సురేశ్‌ సింగ్‌ ఇప్పుడూ సంఘం చైర్మన్‌గా ఉండటం గమనార్హం.

Updated Date - Nov 16 , 2024 | 04:23 AM