ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యాయామ విద్య పేరుతో పీఎఫ్‌ఐ ఆయుధ శిక్షణ

ABN, Publish Date - Oct 19 , 2024 | 03:07 AM

దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది.

  • అంతర్యుద్ధం వచ్చేలా అశాంతి సృష్టే దాని లక్ష్యం: ఈడీ

న్యూఢిల్లీ, అక్టోబరు 18: దేశంలో అంతర్యుద్ధం సృష్టించేందుకు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) పనిచేస్తున్నట్టు ఈడీ ఆరోపించింది. ఇందుకోసం వ్యాయామ విద్య పేరుతో ఆయుధ శిక్షణ ఇస్తోందని తెలిపింది. సమాజంలో అశాంతి నెలకొనేలా చేసేందుకు తరగతులు నిర్వహిస్తోందని పేర్కొంది. దర్యాప్తులో భాగంగా ట్రస్టులు, కంపెనీలు, వ్యక్తుల పేరున ఆ సంస్థకు ఉన్న రూ.56.56 కోట్లు విలువ చేసే 35 స్థిరాస్తులను స్వాధీనం చేసుకున్నట్టు శుక్రవారం తెలిపింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అక్టోబరులో రూ.35.43 కోట్లు విలువ చేసే 19 ఆస్తులు, ఏప్రిల్‌లో రూ.23.13 కోట్లు విలువ చేసే 16 ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు వివరించింది. పీఎ్‌ఫఐకి గల్ఫ్‌ దేశాలు, సింగపూర్‌లో 13వేలకుపైగా సభ్యులు ఉన్నట్టు ఈడీ తెలిపింది.

Updated Date - Oct 19 , 2024 | 03:07 AM