ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: 3 రోడ్‌షోలు.. 3 బహిరంగ సభలు.. నాలుగు రోజులపాటు మోదీ ప్రచారం

ABN, Publish Date - Apr 04 , 2024 | 11:01 AM

రాష్ట్రంలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ నెల 9, 10, 13, 14 తేదీల్లో ప్రచారం చేయనున్నారు.

చెన్నై: రాష్ట్రంలో ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) నాలుగు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ నెల 9, 10, 13, 14 తేదీల్లో ప్రచారం చేయనున్నారు. మూడు ప్రాంతాల్లో రోడ్‌షోలు, మరో మూడో చోట్ల జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాకముందే మోదీ రాష్ట్రంలో ఐదుసార్లు పర్యటించారు. కోయంబత్తూరు, సేలం, మదురై, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్నియాకుమారి తదితర జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కోయంబత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. చెన్నై నందనంలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ నాలుగు రోజులపాటు రోడ్‌ షోలు, ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 9 సాయంత్రం 4గంటలకు వేలూరులో ఎన్డీయే అభ్యర్థి, న్యూ జస్టిస్‌ పార్టీ అధ్యక్షుడు ఏసీ షణ్ముగానికి మద్దతుగా రోడ్‌షోలో పాల్గొంటారు. ధర్మపురి పీఎంకే అభ్యర్థి సౌమ్యా అన్బుమణి, కృష్ణగిరి బీజేపీ అభ్యర్థి నరసింహన్‌, కళ్ళకుర్చి పీఎంకే అభ్యర్థి దేవదాస్‌, తిరువణ్ణామలై బీజేపీ అభ్యర్థి అశ్వత్థామన్‌, ఆరణి పీఎంకే అభ్యర్థి గణేష్ కుమార్‌, చిదంబరం బీజేపీ అభ్యర్థి కాత్యాయని, కడలూరు పీఎంకే అభ్యర్థి తంగర్‌బచ్చాన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు. ఆ రోజు సాయంత్రం 6గంటలకు టి.నగర్‌లో సౌత్‌ చెన్నై బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహిస్తారు. సెంట్రల్‌ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్‌ పి.సెల్వం, నార్త్‌ చెన్నై బీజేపీ అభ్యర్థి పాల్‌ కనకరాజ్‌, తిరువళ్లూరు బీజేపీ అభ్యర్థి పొన్‌ బాలగణపతి, శ్రీపెరుంబుదూరు టీఎంసీ అభ్యర్థి వేణుగోపాల్‌, కాంచీపురం పీఎంకే అభ్యర్థి జ్యోతి వెంకటేశన్‌, అరక్కోణం పీఎంకే అభ్యర్థి కే.బాలుకు మద్దతుగా ప్రచారం చేస్తారు.

ఇదికూడా చదవండి: Alcohol: అబ్బో.. మార్చిలో మనోళ్లు తెగ తాగేశారుగా.. రికార్డు స్థాయిలో రూ.4,475 కోట్ల అమ్మకాలు

ఆ తర్వాత ఈనెల 10 ఉదయం 11 గంటలకు నీలగిరి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌కు మద్దతుగా రోడ్‌షో ద్వారా ప్రచారం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం కోయంబత్తూరులో ఏర్పాటయ్యే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పొల్లాచ్చి, తిరుప్పూరు, ఈరోడ్‌, సేలం, నామక్కల్‌ నియోజకవర్గాల ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. 13న ఉదయం 11 గంటలకు పెరంబలూరులో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ సభలో ఐజేకే అభ్యర్థి పారివేందర్‌, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టినం, మైలాడుదురై, విల్లుపురం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారు. 14న విరుదునగర్‌ నియోజకవర్గంలో ఏర్పాటయ్యే బహిరంగ సభలో ప్రసంగిచనున్నారు. బీజేపీ అభ్యర్థి రాధికా శరత్‌కుమార్‌, మదురై, తేని, దిండుగల్‌, రామనాథపురం, శివగంగ, కన్నియాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ఎన్డీయే అభ్యర్థులు పాల్గొంటారు.

ఇదికూడా చదవండి: Lok Sabha Polls: మాజీ సీఎంను పక్కన పెట్టిన బీజేపీ.. అసలు కారణం అదేనా..?

Updated Date - Apr 04 , 2024 | 11:01 AM

Advertising
Advertising