ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi : సమాజ విచ్ఛిన్నానికి దేశ వ్యతిరేకుల ప్రయత్నం

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:03 AM

తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దేశ వ్యతిరేకులు సమాజ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి ఉద్దేశాల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

  • మన సమైక్యతే వారి ఓటమి: మోదీ

అహ్మదాబాద్‌, నవంబరు 11: తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు దేశ వ్యతిరేకులు సమాజ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. వారి ఉద్దేశాల తీవ్రతను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. వారిని ఓడించేందుకు మనమంతా సమైక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లా వడ్తాల్‌ పట్టణంలో ఉన్న శ్రీస్వామినారాయణ్‌ ఆలయ ద్విశతాబ్ది వార్షికోత్సవానికి హాజరైన భక్తులను ఉద్దేశించి ప్రధాని సోమవారం వర్చువల్‌గా ప్రసంగించారు. ‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు పౌరుల ఐక్యత, దేశ సమగ్రత ముఖ్యం. అయితే, దురదృష్టవశాత్తూ కొందరు తమ సంకుచిత మనస్తత్వంతో, తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుల, మత, భాష, స్ర్తీ-పురుష, గ్రామీణ-పట్టణ పరంగా ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ఓడించేందుకు మనమంతా సమైక్యమవ్వాలి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి ఆత్మనిర్భరతే తొలి అడుగు’ అన్నారు. స్వామినారాయణ్‌ భక్తులైన సాధువులందరూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేసే ప్రతిజ్ఞలో దేశంలోని ప్రతి పౌరుడినీ భాగస్వామ్యం చేయాలని కోరారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆ ఆలయంతో తనకు అనుబంధం ఉందని, ఆలయ ద్విశతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఒక నాణేన్ని కూడా విడుదల చేసిందని మోదీ చెప్పారు. భారత సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు.

కుంభమేళాల ప్రాముఖ్యతను ఇతర దేశాల ప్రజలూ అర్థం చేసుకునేలా స్వామినారాయణ్‌ భక్తులు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించే పూర్ణ కుంభమేళాకు విదేశీయులనూ భారీగా రప్పించాలని కోరారు. ‘ప్రపంచ వ్యాప్తంగా మీ ఆలయాలున్నాయి. ఆ ఆలయాల ద్వారా కుంభమేళా గురించి అవగాహన కల్పించండి. ప్రతి ఆలయం తరఫున కనీసం వంద మంది విదేశీయులను కుంభమేళాకు తీసుకువచ్చేందుకు కృషి చేయండి’ అన్నారు.


  • రాహుల్‌ అబద్ధాలకు అడ్డుకట్ట వేయండి

రాహుల్‌గాంధీ అబద్ధాలకు అడ్డుకట్ట వేయాలని, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిలువరించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు ఫిర్యాదు చేసింది. భారత యూనియన్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా రాహుల్‌ రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ‘‘మహారాష్ట్రకు రావాల్సిన యాపిల్‌ ఐఫోన్‌, బోయింగ్‌ విమానాల తయారీ యూనిట్లు వేరే రాష్ట్రానికి వెళ్లిపోయాయి’’ అని రాహుల్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించింది. మరోవైపు, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రకటనలు మత కోణంలో ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది.

Updated Date - Nov 12 , 2024 | 04:05 AM