ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi : ఝార్ఖండ్‌కు చొరబాట్ల ముప్పు

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:18 AM

ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా కూటమి సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దాహం కోసం బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలను.. ఆ దేశం నుంచి రోహింగ్యాల రూపంలో చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు.

  • జంషెడ్‌పూర్‌లో బీజేపీ ఎన్నికల సభలో మోదీ

రాంచీ, జంషెడ్‌పూర్‌, సెప్టెంబరు 15: ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా కూటమి సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు, అధికార దాహం కోసం బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలను.. ఆ దేశం నుంచి రోహింగ్యాల రూపంలో చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చొరబాటుదారులు ఝార్ఖండ్‌కు పెను ముప్పు అని.. ఫలితంగా ఆ రాష్ట్రంలోని సంతాల్‌ పరగణాలు, కొల్హాన్‌ ప్రాంతాల్లో జనాభా సంతులనం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లోని భూములను రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారని, తద్వారా గ్రామాలపై పట్టుసాధించారని ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నవంబరులో ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌ గోపాల్‌ మైదానంలో ఆదివారం ‘పరివర్తన్‌ మహార్యాలీ’ పేరుతో జరిగిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ వలసలపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చినా రోహింగ్యాల చొరబాట్లను ఝార్ఖండ్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆదివాసీ ఓటు బ్యాంకుతో అధికారంలోకొచ్చిన జేఎంఎం.. అడవులను ఆక్రమించుకుంటున్న బడాబాబులకు దన్నుగా నిలుస్తోందన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 03:18 AM

Advertising
Advertising