Lok Sabha Speaker: స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు..
ABN, Publish Date - Aug 10 , 2024 | 09:26 AM
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నిన్నటితో (శుక్రవారం) ముగిశాయి. లోక్ సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఓం బిర్లా తేనిటి విందు ఇచ్చారు. టీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ సా, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమోళి తదితరులు హాజరయ్యారు.
ఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు నిన్నటితో (శుక్రవారం) ముగిశాయి. లోక్ సభ వాయిదా పడిన వెంటనే స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తేనిటి విందు ఇచ్చారు. టీ పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ సా, కిరణ్ రిజిజు, రామ్మోహన్ నాయుడు, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమోళి తదితరులు హాజరయ్యారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఆప్యాయ పలకరింపు..
స్పీకర్ తేనిటి విందుకు హాజరైన ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పుగా ఉండే వీరు కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ, విపక్ష నేతలు కలిసి ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ముందుగా వాయిదా..
వాస్తవానికి లోక్ సభ ఆగస్ట్ 12వ తేదీన వాయిదా పడాలి. సభ వ్యవహారాలు పూర్తయినందున సమావేశాలు ముగించామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈ సారి సభకు ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారని వివరించారు. సమావేశంలో బడ్జెట్ బిల్లు ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. లోక్ సభ, రాజ్యసభ బడ్జెట్ బిల్లుకు ఆమోదం లభించిందని, జమ్ము కశ్మీర్ విభజన బిల్లు, ఇండియన్ ఎయిర్ క్రాప్ట్ బిల్లులకు కూడా సభ ఆమోదం పొందిందని వివరించారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 10 , 2024 | 09:26 AM