PM Modi: ఆ రెండు రాష్ట్రాల వయోవృద్ధులకు మోదీ క్షమాపణ
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:20 PM
70 ఏళ్లు పైబడిన వారిందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా మంగళవారంనాడిక్కడ ప్రధాని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ: రాజకీయ ప్రయోజనాలను ఆశించే ''ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్'' (Ayushman Bharat Health Insurance)ను ఢిల్లీ (Delhi), పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తప్పుపట్టారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను 70 ఏళ్ల వయోపరిమితికి తాము విస్తరించినప్పటికీ ఉచిత చికిత్స అందనందుకు ఢిల్లీ, బెంగాల్ వయోవృద్ధులకు ప్రధాని క్షమాపణలు తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వారిందరికీ రూ.5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయాన్ని ధన్వంతరి జయంతి, తొమ్మిదో ఆయుర్వేద డే సందర్భంగా మంగళవారంనాడిక్కడ ప్రధాని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యాక్రమాలను, చిన్నారుల వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన యూ-విన్ పోర్టల్‌ను మోదీ ప్రారంభించారు.
PM Modi: అయోధ్య ఆలయంలో దీపావళి.. 500 ఏళ్లలో ఇదే తొలిసారి
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లో 70 ఏళ్లు దాటిన వారికి సేవలందించ లేకపోతున్నందుకు వారికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఆయుష్మాన్ యోజనలో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేరలేదనీ, రాజకీయ వృత్తికి సంబంధించిన అడ్డుగోడల కారణంగా ఆ రాష్ట్రాల్లో అనారోగ్యంతో ఉన్న వారికి తాను సేవ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత ప్రజల ప్రయోజనాలను రాజకీయాల కోసం పణంగా పెట్టడం మానవత్వం అనిపించుకోదని హితవు పలికారు.
వైద్య చికిత్స కోసం ఇళ్లు, భూములు, నగలు అమ్ముకున్న సందర్భాలు గతంలో చాలానే ఉండేవని, తీవ్రమైన వ్యాధుల విషయంలో అయితే చికిత్సకు అయ్యే ఖర్చు వింటేనే పేద ప్రజలు వణికిపోయే పరిస్థితి ఉండేదని ప్రధాని అన్నారు. పేద ప్రజలను వైద్యం చేయించుకోలేని నిస్సహాయత నుంచి బయటకు తీసుకురావాలనే ఆలోచన నుంచే ఆయుష్మాన్ బారత్ పథకం పుట్టిందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేదలకు 5 లక్షల వరకూ ఉచిత వైద్యం అందుతుందని, నాలుగు కోట్లకు పైగా దేశ ప్రజలు ప్రయోజనం పొందుతారని వివరించారు.
ఆ రెండు రాష్ట్రాలు ఎందుకు అమలు చేయలేదు?
ఆయుష్మాన్ భారత్ పథకంలో తమ ప్రభుత్వంలో చేరడం లేదని 2019లో ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రాలు 40 శాతం ఖర్చులు భరించాల్సి ఉండగా మొత్తం క్రెడిట్ కేంద్రం కొట్టేయాలనుకుంటోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరడం లేదని అప్పట్లో ప్రకటించింది. చాలినంత మంది ప్రజలను పథకంలోకి తీసుకురావడం లేదని, అందుకు ప్రతిగా తాము సొంత ఆరోగ్య బీమా పథకాన్ని అమలుకు కసరత్తు చేస్తున్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కేరళలో భారీ బాణాసంచా ప్రమాదం... ఏకంగా 150 మందికి పైగా గాయాలు
ఉగ్రవాదుల చేతుల్లో ఆర్మీ శునకం ఫాంటమ్ మృతి.. ఎలా జరిగిందంటే
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 29 , 2024 | 05:23 PM