ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: మోదీకి 'మదర్స్ డే' గిఫ్ట్‌లు

ABN, Publish Date - May 12 , 2024 | 05:07 PM

ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి దివగంత హీరాబెన్ పటేల్‌తో మోదీ ఉన్న రెండు చిత్తరువులను అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కోల్‌కతా: ప్రపంచ మాతృ దినోత్సవం (World Mother's Day) సందర్భంగా మాతృమూర్తులందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి దివగంత హీరాబెన్ పటేల్‌తో మోదీ ఉన్న రెండు చిత్తరువులను అభిమానులు ఈ సందర్భంగా ఆయనకు అందజేశారు. ఐదో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఈ ఫోటోలను అభిమానులు ప్రదర్శించడంతో మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆ చిత్తరువులను ఆయన అందుకున్నారు.

PM Narendra Modi: ప్రధాని మోదీకి సీఎం కౌంటర్.. ఆ హామీల సంగతేంటి?


''ఇద్దరు వ్యక్తులు రెండు చిత్రపటాలను ఇక్కడకు తీసుకువచ్చి వాటిని ప్రదర్శించారు. ఎంతో ప్రేమతో మీరు వాటిని తీసుకువచ్చారు. పశ్చిమదేశాల్లో ప్రజలు ఈరోజును మాతృదినోత్సవంగా జరుపుకొంటారు. మనం మాత్రం ఇక్కడ మన తల్లిని, దుర్గా మాత, కాళీమాత, భరతమాతను 365 రోజులూ ఆరాధిస్తాం'' అని మోదీ ఈ సందర్భంగా 'మదర్స్ డే' ప్రాధాన్యతను గుర్తు చేశారు. ఇటీవల కాలంలో మోదీ ప్రచార సభల్లో హీరాబెన్‌తో ఆయన ఉన్న ఫోటోలను జనం ప్రదర్శించిన సంఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. మోదీ సైతం వారి పేర్లు ఫోటోల వెనుక రాసి తనకు ఇవ్వాలని, వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తానని చెబుతున్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 12 , 2024 | 05:07 PM

Advertising
Advertising