ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఇది ట్రైలరే.. జీడీపీ వృద్ధిపై మోదీ ఆసక్తికర స్పందన

ABN, Publish Date - Jun 01 , 2024 | 03:29 PM

దేశ జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేయగా.. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ(GDP) వృద్ధి రేటు 8.2 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సూచ‌న‌గా ఆయ‌న పేర్కొన్నారు.

ఢిల్లీ: దేశ జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేయగా.. ఈ గణాంకాలపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ(GDP) వృద్ధి రేటు 8.2 శాతానికి చేరుకుందని ప్రకటించారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు సూచ‌న‌గా ఆయ‌న పేర్కొన్నారు. వృద్ధి రేటు మునుపటి అంచనాలను మించిపోయిందన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. జీడీపీ వృద్ధిపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. '2023-24 Q 4 జీడీపీ వృద్ధి డేటా దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని సూచిస్తోంది. ఇది మరింత వేగం పుంజుకోనుంది. దేశాభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రజలకు ధన్యవాదాలు. జీడీపీ ఈ స్థాయిలో వృద్ధి చెందడం ట్రైలర్ మాత్రమే' అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


త్రైమాసిక, వార్షిక వృద్ధి..

2023–24 నాలుగో త్రైమాసికంలో దేశ వాస్తవ GDP 7.8 శాతం వృద్ధి రేటును ప్రతిబింబిస్తూ రూ. 47.24 లక్షల కోట్లకు పెరిగింది. ఏడాది పొడవునా, జనవరి-మార్చి కాలంలో 7.8 శాతం స్వల్పంగా మందగించినప్పటికీ, వివిధ రంగాల్లో బలమైన వృద్ధితో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మంచి పనితీరు కనబరిచింది.

ఈ గణనీయమైన వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థను 3.5 ట్రిలియన్‌లకు పెంచింది. రాబోయే సంవత్సరాల్లో USD 5-ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి వేదికను ఏర్పాటు చేసింది.


తయారీ రంగంలో వృద్ధి..

త‌యారీ రంగం ప్రోత్సాహ‌క‌ర వృద్ధి న‌మోదు చేయ‌డంతో మెరుగైన జీడీపీ గ‌ణాంకాలు సాధ్యమయ్యాయి. 2023-24లో త‌యారీ రంగం ఏకంగా 8.9 శాతం వృద్ధి చెందింది. ఇక చివ‌రి క్వార్టర్‌లోనూ భార‌త జీడీపీ 7.8 శాతంతో స‌త్తా చాటింది. అయితే వ్యవసాయ రంగం వృద్ధి 0.6 శాతానికి క్షీణించింది.

సేవల రంగ వృద్ధి మిశ్రమంగా ఉంది. ఆర్థిక, రియల్ ఎస్టేట్ రంగాలు 7.6 శాతం వృద్ధిని సాధించాయి. వాణిజ్యం, ఆతిథ్య రంగం 5.1 శాతం పెరిగింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 03:30 PM

Advertising
Advertising