PM Modi: నిఘా నీడలో కన్నియాకుమారి..
ABN, Publish Date - May 30 , 2024 | 12:00 PM
ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కన్నియాకుమారికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గురువారం మధ్యాహ్నం రానున్నారు. కన్నియాకుమారి సముద్రతీరంలోని వివేకానంద స్మారక మండపంలో ఆయన 45 గంటలపాటు ధ్యానం చేయనున్నారు.
- నేడు మోదీ రాక
- 4 వేల మంది పోలీసులతో బందోబస్తు
- నేటినుంచి వివేకానంద మండప సందర్శన రద్దు
చెన్నై: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం కన్నియాకుమారికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) గురువారం మధ్యాహ్నం రానున్నారు. కన్నియాకుమారి సముద్రతీరంలోని వివేకానంద స్మారక మండపంలో ఆయన 45 గంటలపాటు ధ్యానం చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ ప్రముఖ తీర్థ స్థలాల్లో ధ్యానం చేయడం ఆనవాయితీ. ఆ మేరకు 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతిభాంకర్ అనే పుణ్యక్షేత్రంలో ధ్యానం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో హిమాలయాల్లోని కేదార్‌నాథ్ గుహకు వెళ్ళి ధ్యానం చేశారు. అప్పటి నుంచి ఆ గుహను మోదీ ధ్యాన గుహగా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలు ముగియనున్న వేళ ధ్యానం చేయడానికి కన్నియాకుమారి వివేకానంద స్మారక మండపాన్ని ఎంచుకుని అక్కడ 45 గంటలపాటు ధ్యానం చేయాలని సంకల్పించారు. ఆ మేరకు గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి కేరళలోని తిరువనంతపురానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 4.45 గంటలకు కన్నియాకుమారి ప్రభుత్వ అతిథిగృహం సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు. అక్కడ బీజేపీ(BJP) స్థానిక నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి ఆయన కారులో కన్నియాకుమారి సముద్రతీరంలోని పూంపుహార్ బోట్‌హౌస్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక పడవలో మోదీ వివేకానంద స్మారక మండప ప్రాంతానికి వెళతారు. గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆ మండపంలోకి ప్రవేశించే మోదీ జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం వరకూ అక్కడే బసచేయనున్నారు. రెండు రాత్రులు ఆయన అక్కడే నిద్రించనున్నారు. జూన్ ఒకటో తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ వివేకానంద స్మారక మంటపం నుండి బయటకు వస్తారు.
ఇదికూడా చదవండి: ADR: 15 ఏళ్లలో 104 శాతం పెరిగిన రాజకీయ పార్టీలు.. ఏడీఆర్ నివేదికలో ఆసక్తికర విషయాలు
భారీ భద్రతా ఏర్పాట్లు...
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పదివేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారు. కన్నియాకుమారి సముద్రతీరంలోని బోట్‌హౌ్‌సలో మోదీని వివేకానంద స్మారక మండపానికి తీసుకెళ్లేందుకు ఇప్పటికే మూడు పడవలను సిద్ధం చేసి ఉంచారు. గురువారం సాయంత్రం ఆరుగంటలకు ఆ మంటపాన్ని చేరుకున్న వెంటనే ఆయన ధ్యానాన్ని ప్రారంభించనున్నారు. 1892లో స్వామివివేకానంద ప్రస్తుతం మండపం ఉన్న ప్రాంతం వద్ద మూడు రోజులపాటు భారతదేశానికి బంగారు భవిష్యత్తు కలగాలని ఆకాంక్షిస్తూ ధ్యానం చేశారు. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకునే మోదీ మూడు రోజులపాటు ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజులూ ఆయన ద్రవపదార్ధాలే ఆహారంగా తీసుకుంటారని, ప్రత్యేకించి కొబ్బరినీరు అధికంగా తీసుకుంటారని తెలుస్తోంది. ఇక వివేకానంద స్మారక మండపంలోని ధ్యానమందిరంలో ఫ్యాన్లు మాత్రమే ఉండటంతో మోదీ కోసం ఎయిర్‌కండిషన్ కూడా ఏర్పాటు చేశారు. ధ్యానం చేయని సమయాల్లో మోదీ సేదతీరటానికి, నిద్రకు అనువుగా ఆ మండపంలో ఏసీతో ఓ గది కూడా సిద్ధం చేశారు. ఇక మోదీ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి ప్రత్యేక వైద్యబృందం కూడా ఆ మండపం వద్ద సిద్ధంగా వుంటుంది. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని కన్నియాకుమారి అంతటా గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. నాలుగు వేల మంది పోలీసులు సముద్రతీ ప్రాంతంలో కాపలా కాస్తున్నారు. డీఐజీ ప్రవేశ్‌కుమార్ నేతృత్వంలో ఎనిమిది మంది డీఎస్పీలు భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన ప్రధాని భద్రతా దళం ఉన్నతాధికారులు కన్నియాకుమారిలో గత మూడు రోజులుగా మకాంవేసి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 30 , 2024 | 12:00 PM