ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి మోదీ పూజలు

ABN, Publish Date - May 14 , 2024 | 11:40 AM

ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ వద్ద గంగానదికి ఆయన పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్‌లో నమో ఘాట్‌కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

ఉత్తరప్రదేశ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM) మంగళవారం వారణాసి (Varanasi)లో నామినేషన్ (Namination) దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో దశాశ్వమేధ ఘాట్ (Dashaswamedha Ghat) వద్ద గంగానది (Ganga River)కి ఆయన పూజలు చేశారు. అక్కడి నుంచి క్రూజ్‌ (Cruise)లో నమో ఘాట్‌ (Namo Ghat)కు వెళ్లారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. హాజరయ్యేవారిలో బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత, చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారణాసి వెళ్లారు. మోదీ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో పార్టీ కార్యకర్తలో ప్రధాని భేటీ కానున్నారు. గతంలో కంటే ఈసారి మోదీ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బీజేపీ నేతలు తరలి వస్తున్నారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుతూ బీజేపీ నేతలు దేశ వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు.


కాగా ప్రధాని మోదీ నామినేషన్ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని బీజేపీ (BJP) నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాని పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లకు మోదీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.


వారణాసిలో మోదీ భారీ రోడ్‌షో

కాగా వారణాసిలో లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి పోటీచేస్తున్న నరేంద్ర మోదీ సోమవారం ఆరు కిలోమీటర్ల మేర ఆ పట్టణంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. విద్యా రంగ సంస్కర్త మదన్‌మోహన్‌ మాలవీయా విగ్రహానికి పూలమాల సమర్పించి తన యాత్రను ఆయన ప్రారంభించారు. రోడ్‌షోలో ఆయన వెంట యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ఉన్నారు. ప్రధానమంత్రికి ఆహ్వానం పలుకుతూ, కనీసం వంద చోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. కాషాయ దుస్తులు ధరించిన మహిళలు రోడ్డుకు అటు ఇటు పెద్దఎత్తున గుమిగూడి రోడ్‌షోకు స్వాగతం పలికారు. నరేంద్రమోదీపై పూలవర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ యూకే టూర్‌పై నేడు సీబీఐ కోర్టు తీర్పు..

ఏబీఎన్ పేరుతో వైసీపీ సర్వే ఫేక్ వీడియో..

తెలంగాణలో భారీగా క్రాస్ ఓటింగ్..

ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..

నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ గుండాల దాడులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 14 , 2024 | 11:40 AM

Advertising
Advertising