ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: కాంగ్రెస్ దివాలాకోరు విధానం

ABN, Publish Date - Apr 30 , 2024 | 04:56 AM

కాంగ్రెస్‌ దివాలా కోరు విధానాలను అనుసరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీది అర్బన్‌ నక్సల్‌ ఆలోచన ధోరణి అని చెప్పారు.

సంపద పునఃపంపిణీ అర్బన్‌ నక్సల్‌ ఆలోచన ధోరణి.. పలు ఇంటర్వ్యూల్లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: కాంగ్రెస్‌ దివాలా కోరు విధానాలను అనుసరిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీది అర్బన్‌ నక్సల్‌ ఆలోచన ధోరణి అని చెప్పారు. సంపద పునఃపంపిణీ ప్రతిపాదన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. కొన్ని వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. కాంగ్రెస్‌, వామపక్షాలు జట్టుకట్టి కేరళ రాష్ట్రాన్ని ఇప్పటికే దివాలా అంచులకు చేర్చాయని, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సైతం అదే పనిలో ఉందని ఆయన అన్నారు. ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని, దేశభక్త ప్రజానీకం దీన్ని అంగీకరించబోదని ఆయన అన్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో తమకు 400కు పైగా సీట్లు వస్తాయన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాపాడేందుకే తమకు ఇన్ని సీట్లు అవసరమన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వెలువడే ఫలితాలు అనేక భ్రమల్ని పటాపంచలు చేస్తాయన్నారు. తన మాటే తన గ్యారెంటీ అని ప్రధాని స్పష్టం చేశారు. ఎక్స్‌-రే లేదా సామాజిక-ఆర్థిక సర్వే చేపట్టనున్నట్టు ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటన గురించి మాట్లాడుతూ.. ఎక్స్‌-రే అంటే ప్రతి ఇంటిపై దాడి చేయడమని, ఎవరైనా మహిళ ధాన్యాలు నిల్వ ఉంచే చోట బంగారాన్ని దాచి ఉంచితే దాన్ని కూడా ఎక్స్‌-రే చేస్తారని చెప్పారు.


ఆ ఆభరణాలను జప్తు చేస్తారని, భూమి రికార్డులను పరిశీలిస్తార ని తెలిపారు. వీటిని పునఃపంపిణీ చేస్తారన్నారు. ఈ మావోయిస్టు భావజాలం ప్రపంచానికి ఎప్పుడూ సాయం చేయలేదని, ఇది పూర్తిగా ‘అర్బన్‌ నక్సల్స్‌’ ఆలోచన అని ప్రధాని పేర్కొన్నారు. వారు దోచుకోవడానికి ప్రణాళిక రచిస్తున్నారని, ఈ నేపథ్యంలో దేశాన్ని మేల్కోల్పడం తన బాధ్యతని ప్రధాని అన్నారు. మరోవైపు వారసత్వ పన్నుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మాట్లాడుతూ.. వారసత్వ పన్నును అమలు చేసే లేదా పరిశీలించే ఆలోచన బీజేపీకి లేదన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 04:56 AM

Advertising
Advertising