ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Asaduddin Owaisi: మోదీజీ.. ఆర్టికల్ 26 ఓసారి చదవండి

ABN, Publish Date - Dec 14 , 2024 | 08:50 PM

ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

న్యూఢిల్లీ: దేశంలో మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఐఏఎంఐఎం చీఫ్ అసదుద్దీ్న్ ఒవైసీ (Asaduddin Owasi) ఆందోళన వ్యక్తం చేశారు. 75 ఏళ్ల రాజ్యాంగంపై లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులపై మోదీ తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఆర్టికల్ 26 (Article 26)ను ఆయన చదువుకోవాలని సూచించారు. వ్యక్ఫ్ బోర్డు ప్రస్తావన రాజ్యాంగంలో లేదని మోదీ చెబుతున్నారని, ఆయనకు రాజ్యంగ పాఠాలు చెబుతున్నది ఎవరని ప్రశ్నించారు.

PM Modi: రాజ్యాంగంపై చర్చలో కాంగ్రెస్‌ ఫ్యామిలీపై మోదీ చురకలు


''ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోంది. మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చింది. రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డు ప్రస్తావనే లేదని ప్రధాని చెబుతున్నారు. మీకు పాఠాలు చెబుతున్నది ఎవరు? ముందు ఆర్టికల్ 26ను చదవండి. వక్ఫ్ బోర్డు ఆస్తులను ఊడలాక్కోవడమే మీ లక్ష్యం. బలం ఉంది కదాని వక్ఫ్ ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు'' అని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


హర్యానా, రాజస్థాన్‌లో గోసంక్షకులకు పోలీస్ హక్కులు ఇచ్చారనీ, మూకదాడులతో ఆ హక్కులను దుర్వినియోగం చేశారని, బెంగాల్‌కు చెందిన షబీర్ మాలిక్ అనే వ్యక్తిని కొట్టి చంపారని ఒవైసీ అన్నారు. ఆయన గోమాంసం తీసుకోలేదని ఆ తర్వాత తెలిసింది. జునైద్, నసీర్‌ను సజీవదహనం చేశారని ఆరోపించారు. ''500 ఏళ్ల క్రితం మసీదు ఉందని చెబితే నేను పార్లమెంటును తవ్వి, అక్కడ ఏదైనా దొరికితే అది నాదైపోతుందా?'' అని ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి..

Akhilesh Yadav: ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించండి: అఖిలేష్

Tamilnadu: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్ కన్నుమూత

Red Fort: ఎర్రకోట మాది.. తిరిగిచ్చేయండి..

జస్టిస్‌ శేఖర్‌ యాదవ్‌పై అభిశంసన నోటీసు

For National News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 08:50 PM