ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: బుజ్జగింపు రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

ABN, Publish Date - Apr 12 , 2024 | 03:42 PM

బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.

కశ్మీర్: బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. "నవరాత్రుల సందర్భంగా ఇండియా కూటమి నేతలు మాంసాహారం తీసుకుంటారు.

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనేది బీజేపీ తీసుకున్న అతిపెద్ద సాహసోపేతమైన నిర్ణయం. ఇది అందరికీ సమాన రాజ్యాంగ హక్కులను కల్పిస్తుంది. ఇండియా కూటమి(INDIA Bloc) భారత సంస్కృతి విస్మరించిన బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోంది. కూటమి నేతలకు ప్రజల మనోభావాలతో పని లేదు. విలువలు పట్టించుకోరు. విభజన రాజకీయాలకు పాల్పడతారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు దూరంగా ఎందుకున్నాయి.


కాంగ్రెస్ నేతలు ప్రాణ ప్రతిష్ఠను ఎన్నికల కార్యక్రమంగా అభివర్ణించారు. అయితే రామమందిర పోరాట ఉద్యమం 500 ఏళ్లకుపైనే నడిచిందని ఆ పార్టీకి తెలియదా. తమ బుజ్జగింపు రాజకీయాలను కొనసాగించే క్రమంలో ఇండియా కూటమి నేతలు పెద్ద బంగ్లాలలో నివసించారు. కానీ రామ్‌లల్లాను డేరాకి పరిమితం చేశారు. బీజేపీ రాముడికి ప్రపంచమే అబ్బురపడే గుడిని నిర్మించింది.

Delhi: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా

దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో ఎన్నికలకు ముందు తీవ్రవాదం, బంద్‌లు, రాళ్ల దాడులు, సరిహద్దు ఘర్షణలు వంటి సమస్యలు తలెత్తకపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో గడిచిన పదేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశాం. విపక్షాలకు ఈ ప్రాంతాభివృద్ధిపై పట్టింపులేదు. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించే అవకాశం లభించింది. ఐఐఎం, ఐఐటీ వంటి విద్యా సంస్థల ఏర్పాటుకు పునాది పడింది. అవినీతి నిర్మూలన జరిగింది" అని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 03:56 PM

Advertising
Advertising