ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rajya Sabha Updates: విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్న మోదీ..

ABN, Publish Date - Jul 03 , 2024 | 01:29 PM

పదేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో పనులు చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు.

PM Modi

పదేళ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో పనులు చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్రప్రభుత్వం తరపున ప్రధాని మంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. రైతు సాధికారతకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులకు పంట రుణాలు అందించామని, పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. తక్కువ ధరలకు ఎరువులు అందిస్తున్నామని చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామన్నారు. గతంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడం కష్టంగా ఉండేదని, ప్రస్తుతం సులభంగా కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నామన్నారు. రైతులందరికీ పంటల బీమా పథకం లబ్ధి చేకూరిందని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాలు చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి ప్రయోజనాలు అందించలేదని మోదీ విమర్శించారు.
Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..


విపక్షాలు వాకౌట్

ప్రధాని మంత్రి నరేంద్రమోదీ అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ సభ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్య ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విపక్ష సభ్యులు ఎగువ సభను అవమానిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం సభను అవమానించిందని.. చర్చ నుంచి పారిపోవడమే ప్రతిపక్షాల విధి అంటూ విమర్శించారు.

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు


విపక్షాల వాకౌట్‌పై రాజ్యసభ ఛైర్మన్..

విపక్షాల వాకౌట్‌పై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తన తీరు మార్చుకోవడం లేదన్నారు. ఇవాళ విపక్ష సభ్యులు రాజ్యాంగాన్ని అగౌరవపరిచారన్నారు. ప్రతిపక్షాల వాకౌట్‌ను ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కంఠస్థం చేయాల్సిన పుస్తకం కాదని.. రాజ్యాంగం జీవించడానికి ఒక మార్గదర్శనం అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటమంటే.. మొదట రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాజ్యాంగ విలువలు పాటించకుండా.. విపక్షాలు భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాయరు.

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!


పోరాడే ధైర్యం లేదు..

ప్రతిపక్షాల వాకౌట్‌పై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. విపక్షాలకు పోరాడే ధైర్యం లేదన్నారు. దేశం ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని తెలిపారు. తాను విధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. ప్రతిపక్షాల ప్రయత్నాలన్నీ విఫలమవడంతో బయటకు వెళ్లిపోయారన్నారు.

లంచ్ అవర్ క్యాన్సిల్

రాజ్యసభ నియమాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు భోజన విరామం ప్రకటిస్తారు. అయితే ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుటుండటం, ప్రసంగం పూర్తికాకపోవడంతో ఈరోజు లంచ్ అవర్‌‌ను క్యాన్సిల్ చేస్తున్నామని రాజ్యసభ ఛైర్మన్ ప్రకటించారు. ఛైర్మన్ తన నిర్ణయం తీసుకోవడానికి ముందు సభ్యుల అభిప్రాయం తీసుకున్నారు.


Hathras: హత్రాస్‌ తొక్కిసలాట ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందం.. నేడు సీఎం కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 03 , 2024 | 01:29 PM

Advertising
Advertising