ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mallikarjun Kharge: పాత ప్రసంగాలతో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు... మోదీపై ఖర్గే విమర్శలు

ABN, Publish Date - Oct 06 , 2024 | 06:22 PM

మేకిన్ ఇండియా' ఘోరంగా విఫలమైందని మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. ప్రజలపై గృహ రుణాల భారం పెరిగిందని, ధరలు పెరిగాయని, తయారీ రంగం కడగండ్ల పాలైందని అన్నారు.

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆదివారంనాడు తీవ్ర విమర్శలు గుప్పించారు. మోదీ పదే పదే పాత ప్రసంగాలే పునరావృతం చేసినా దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలని కప్పిపుచ్చలేరని అన్నారు. 'మేకిన్ ఇండియా' ఘోరంగా విఫలమైందని తప్పుపట్టారు. ప్రజలపై గృహ రుణాల భారం పెరిగిందని, ధరలు పెరిగాయని, తయారీ రంగం కడగండ్ల పాలైందని అన్నారు.

Rahul Gandhi: 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలి: రాహుల్


''పదే పదే పాతబడిన ప్రసంగాలతో ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను మీరు (ప్రధాని) కప్పిపుచ్చలేరు. 2013-14 నుంచి 1022-23 వరకూ గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయి. గృహ రుణం జీడీపీలో 40 శాతం ఆల్‌టైమ్ రికార్డుకు పెరిగింది. హౌస్‌హోల్డ్ సేవింగ్స్ 50 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. భారతీయ కుటుంబాల ఆదాయం కంటే వినియోగం పెరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే హోమ్ కుక్డ్ వెజ్ తాలీ ధర సెప్టెంబర్‌లో 11 శాతం పెరిగింది. ధరలు పెంచేసి అసంఘటిత రంగం దెబ్బతినడానికి బీజేపీనే కారణం. కాంగ్రెస్-యూపీఏ హయాంలో పెరిగిన ఇండియా ఎగుమతుల లాభాలను మీ విధానాలతో విస్మరించారు. దీంతో 10 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియా ఘోరంగా విఫలమైంది'' అని ఖర్గే సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో విమర్శలు గుప్పించారు.


డైమండ్ వర్కర్ల ఆత్మహత్యలు

సూరత్‌లోని డైమండ్ వర్లర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి వేతనం 30 శాతానికి తగ్గిపోయిందని, ప్రధానమైన డైమెండ్ యూనిట్లు అతికష్టంగా వారంలో నాలుగు రోజులే పని చేస్తు్న్నాయని ఖర్గే చెప్పారు. గత ఆరు నెలల్లో 60 మందికి పైగా డైమండ్ వర్కర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డిమాండ్‌ను కృత్రిమంగా తగ్గించి ఆ పేరుతో వేతనాలు జాప్యం చేస్తోందని, విపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులివ్వవడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోందని విమర్శించారు.


Read Latest and National News

Actor SV Shekhar: ఆయన వచ్చాక బీజేపీలో నేరస్తులకే చోటు..

Heart Stroke: విషాదం.. శ్రీ రాముడి ప్రదర్శన ఇస్తుండగా హార్ట్ ఎటాక్

Updated Date - Oct 06 , 2024 | 06:22 PM