Narendra Modi: తప్పుడు వాగ్దానాల కాంగ్రెస్ రాజకీయాలను జనం గుర్తించారు.. మోదీ ఫైర్
ABN, Publish Date - Nov 01 , 2024 | 09:29 PM
కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఎప్పటికీ నెరవేరమనే విజయం ప్రజల ముందు బహిర్గతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి రెండూ దెబ్బతిని, మరింత అధ్వాన్న స్థితిలోకి జారిపోతున్నాయని వరుస ట్వీట్లలో మోదీ విమర్శలు గుప్పించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congres పార్టీ తప్పుడు హామీల (Fake promises) తో ప్రజలను మభ్యపెట్టడానికే పరిమితమైందని, ఇప్పుడు ప్రజలు కూడా గ్రహించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. అమలు చేయడానికి ఆసాధ్యమని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం వెంబడి ప్రచారం హామీలు గుప్పిస్తూనే ఉందని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఎప్పటికీ నెరవేరమనే విజయం ప్రజల ముందు బహిర్గతమైందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి రెండూ దెబ్బతిని, మరింత అధ్వాన్న స్థితిలోకి జారిపోతున్నాయని వరుస ట్వీట్లలో మోదీ విమర్శలు గుప్పించారు.
Congr Letter Ec: మాపై వాడిన భాష బాగోలేదు.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఘాటు లేఖ
''కాంగ్రెస్ పార్టీ అసాధ్యం కాని హామీలు తేలిగ్గా ఇవ్వడం నేర్చుకుంది. తాము ఇచ్చే హామీలు ఎప్పటికీ నెరవేరని తెలిసి కూడా ఒక ప్రచారం తరువాత మరో ప్రచారంలో తప్పుడు హామీలు ఇస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రజల ముందు వారి డొల్లతనం బయటపడింది'' అని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ఈరోజు పరిస్థితి చూస్తే ఆర్థిక ఆరోగ్యం, అభివృద్ధి పథం అనేవి దయనీయ పరిస్థితికి చేరుకున్నాయని చెప్పారు. హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. ఇది ఆయా రాష్ట్ర ప్రజలను దారణంగా మోసగించడమేనని చెప్పారు. కాంగ్రెస్ రాజకీయాలకు పేదలు, యువకులు, రైతులు, మహిళలు బాధితులుగా మారానని, చివరకు అమలులో ఉన్న పథకాలను కూడా నీరుగారిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ తప్పుడు హామీల సంస్కృతి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హర్యానా ప్రజలు ఇటీవలే కాంగ్రెస్ పార్టీ డొల్ల హామీలను తిప్పికొట్టి సుస్థిర ప్రభుత్వం కోసం బీజేపీని మూడోసారి గెలిపించారని మోదీ గుర్తుచేశారు.
ఖర్గే వ్యాఖ్యల నేపథ్యంలో..
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల బడ్జెట్‌కు అనుగుణంగా హామీలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ యూనిట్లకు సూచలను ఇచ్చిన క్రమంలో మోదీ తాజా వ్యాఖ్యలు చేశారు. జ్రాగ్రత్తగా పరిశీలించే హామీలు ఇవ్వాలని, ఎలాంటి ప్రణాళిక లేకుండా హామీలు ప్రకటించడం పలు ఆర్థిక సమస్యలు తలెత్తి, భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పార్టీ విభాగాలకు ఖర్గే దిశానిర్దేశం చేశారు. ఒకేసారి 5,6,10, 20 అంటూ హామీలు ఇవ్వవద్దని, బడ్జెట్ ప్రాతిపదికగానే హామీలు ప్రకటించాలన్నారు. లేదంటే దివాళా తప్పదన్నారు. రోడ్లకు ఖర్చు చేసేందుకు డబ్బులు లేకపోతే ప్రతి ఒక్కరూ నిలదీస్తారని, ప్రభుత్వం విఫలమైతే భవిష్యత్ తరాలకు ఏమీ చేయలేదనే చెడ్డపేరు వస్తుందని, అందుకు బాధ్యులైన వారిని పదేళ్ల పాటు ప్రజలు దూరం పెట్టేస్తారని హితవు పలికారు.
ఇవి కూడా చదవండి...
Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం
PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
For National News And Telugu News...
Updated Date - Nov 01 , 2024 | 09:33 PM