ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM KISAN instalement: రూ.20 వేల కోట్లు విడుదల.. ఎప్పుడంటే..?

ABN, Publish Date - Jun 15 , 2024 | 04:56 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 18న వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 17వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.20,000 కోట్లు విడుదల చేయదలనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈనెల 18న వారణాసి (Varanasi)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN Nidhi) స్కీమ్ 17వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.20,000 కోట్లు విడుదల చేయదలనున్నారు. అనంతరం 30,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు (Krishi Sakhis)కు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ఈ వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.


నరేంద్రమోదీ జూన్ 10న మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ పీఎం కిసాన్ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్ కింద రూ.20,000 కోట్లు విడుదల చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారా 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. 2019 ఫిబ్రవరిలో ప్రారంభించిన ఈ పథకం కింద రైతుల ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్లకు నేరుగా రూ.6,000 వార్షిక మొత్తంగా జమ అవుతుంది. ఒక్కో ఇన్‌స్టాల్‌కు రూ.2,000 చొప్పున మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌గా ఈ మొత్తాన్ని జమచేస్తారు.

Mallikarjun Kharge: మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు... ఖర్గే జోస్యం


వారణాసి ఈవెంట్‌లో 2.5 కోట్ల మంది రైతులు

కాగా, 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.20,000 కోట్లు విడుదల చేసే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది రైతులు పాల్గొంటారని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారణాసిలో ప్రధాని 'సింగిల్ క్లిక్'తో బటన్ నొక్కిన వెంటనే 9.26 కోట్ల మంది రైతు లబ్ధిదారులకు ఆ మొత్తం చేరుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతులను చైతన్యవంతులను చేసేందుకు దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన్ కేంద్రాలు, లక్షకు పైగా ప్రైమరీ అగ్నికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీలు, 5 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు పాల్గొంటాయని మంత్రి తెలిపారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 15 , 2024 | 05:14 PM

Advertising
Advertising