ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

wayanad landslides: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

ABN, Publish Date - Aug 10 , 2024 | 07:41 AM

ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని సమాచారం.

PM Modi

న్యూఢిల్లీ, ఆగస్ట్ 10: ప్రకృతి సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పర్యటించనున్నారు. అందులో భాగంగా చూరల్మల, ముండక్కై గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన సందర్శించనున్నారని సమాచారం. అనంతరం జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలపై ఉన్నతాధికారులుతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు.


ఉదయం 11.00 గంటలకు కన్నూరుకు ప్రధాని...

శనివారం ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక విమానంలో కన్నూరుకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌‌లో వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా వీక్షించనున్నారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తుగా పరిగణించాలని ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వయనాడ్ ఘటనను ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించే అవకాశముందని తెలుస్తుంది.


420 మృతదేహాలకు పోస్ట్‌మార్టం..

మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ ఘటనను జాతీయ విపత్తగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కొండ చరియలు విరిగి పడిన ఘటనలో 420 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. మరిన్ని మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముందన్నారు. అందుకోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధికారికంగా 225 మంది మృతి చెందారని.. వివిధ ప్రాంతాల్లో మొత్తం 195 మృతదేహాలు లభ్యమైనాయని ఆయన పేర్కొన్నారు. ఈ మృతదేహాలకు సంబంధించి డీఎన్‌ఏ శాంపిల్స్ వైద్య పరీక్షల కోసం పంపామన్నారు. అలాగే 178 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పారు. మిగిలిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామన్నారు.


స్పందించిన చిత్రపరిశ్రమ.. వెళ్లిపోయిన భారత సైన్యం..

ఇక వయనాడ్‌ ఘటనపై దక్షిణ భారతదేశానికి చెందిన చలన చిత్ర పరిశ్రమ స్పందించి... సీఎం‌డీఆర్ఎఫ్‌కు నిధులు అందజేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం పినరయి విజయన్ గుర్తు చేశారు. అలాగే వయనాడ్‌లో10 రోజుల సహాయక చర్యలు పూర్తి కావడంతో.. భారత సైన్యం తిరిగి వెళ్లిపోయిందన్నారు. అయితే గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆగ్నిమాపక దళం, కేరళ పోలీసులు శాఖలు పాల్గొంటున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వివరించారు. వయనాడ్ ఘటనపై తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వయనాడ్‌లో ఇప్పటికే పర్యటించిన విషయం విధితమే.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 07:43 AM

Advertising
Advertising
<