Modi Reveals: అంతరిక్షంలోకి వెళ్లే నలుగురి పేర్లను ప్రస్తావించిన ప్రధాని మోదీ..ఎవరెవరంటే
ABN, Publish Date - Feb 27 , 2024 | 01:17 PM
ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌లో ప్రయాణించే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ క్రమంలో వారికి బ్యాడ్జీలు తొడిగి అభినందించారు. అయితే వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)ని సందర్శించారు. మూడు రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. తిరువనంతపురం సమీపంలోని తుంబలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (VSSC) పర్యటన సందర్భంగా రూ. 1,800 కోట్ల విలువైన మూడు ప్రధాన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే భారతదేశ మానవ సహిత అంతరిక్ష యాత్ర మిషన్ 'గగన్‌యాన్' పురోగతిని ప్రధాని సమీక్షిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Elections: లోక్‌సభ ఎన్నికల సందడి మొదలు.. రాష్ట్రంపై ఈసీ డేగ కన్ను
ఈ క్రమంలోనే గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు నలుగురు వ్యోమగాములు(astronauts) ఎంపికయ్యారు. తొలి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. వారిలో గ్రూప్ కెప్టెన్ పీ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా పేర్లు ఉన్నట్లు ప్రధాని చెప్పారు. ఈ క్రమంలోనే గగన్‌యాన్ మిషన్‌లోని నలుగురు వ్యోమగాముల దుస్తువులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెక్కలతో ఉన్న బ్యాడ్జీలను తొడిగి అభినందించారు.
ఈ నలుగురు వ్యోమగాములు భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లుగా ఉన్నారు. అయితే వీరంతా స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయులుగా రికార్డు దక్కించుకోనున్నారు. గతంలో రాకేష్ శర్మ భారత్(bharat) తరఫున అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యోమగామిగా రికార్డు కెక్కారు. కానీ ఆయన రష్యా ప్రయోగ కేంద్రం నుంచి వెళ్లిన నౌకలో ఈ ఘనతను సాధించారు.
Updated Date - Feb 27 , 2024 | 03:03 PM