Nitin Gadkari: ఇప్పుడు నడుస్తున్నదంతా పవర్ పాలిటిక్సే.. గడ్కరి చురకలు
ABN, Publish Date - Sep 27 , 2024 | 08:34 PM
ఆర్ఎస్ఎస్ కర్యకర్తగా తాను పనిచేసినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ అప్పట్లో తామెన్నో అవాంతరాలు ఎదుర్కొన్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చెప్పారు. తగిన గుర్తింపు కానీ, గౌరవం కానీ ఉండేవి కావన్నారు.
ఛత్రపతి శంభాజీనగర్: నడుస్తున్న రాజకీయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) నిశిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే ఒకప్పుడు సామాజిక సేవగా, దేశ నిర్మాణంగా, అభివృద్ధికి మారుపేరుగా ఉండేవని, ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయని అన్నారు. నడుస్తు్న్నదంతా పవర్ పాలిటిక్సేనంటూ చమత్కరించారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభావు బగాడే సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ కర్యకర్తగా తాను పనిచేసినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ అప్పట్లో తామెన్నో అవాంతరాలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. తగిన గుర్తింపు కానీ, గౌరవం కానీ ఉండేవి కావన్నారు.
MUDA Scam: వెంటాడుతున్న ముడా స్కామ్.. సీఎంపై కేసు నమోదు
పార్టీ కార్యకర్తగా తాను 20 ఏళ్ల పాటు విదర్భలో పనిచేశానని, అప్పట్లో తమ ర్యాలీలపై జనం రాళ్లు కూడా రువ్వేవారని, ఎమర్జెన్సీ తర్వాత ప్రచారం కోసం తాను ఉపయోగించే ఆటోను కూడా కొందరు తగులబెట్టారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వేలాది మంది ఇక్కడకు వచ్చి తన మాటలు వింటున్నారని, అయితే ఈ పాపులారిటీ తనది కాదని, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కష్టపడిన హరిభావు భగాడే వంటి కార్యకర్తలదేనని అన్నారు. పార్టీ నుంచి ఏదైనా పొందినప్పుడు పనిచేయడంలో విశేషమేమీ లేదని, పార్టీ ఏమీ ఇవ్వకపోయినా అహరహం శ్రమించేవాడే మంచి కార్యకర్త అని నిర్వచనం చెప్పారు.
Read More National News and Latest Telugu News
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Sep 27 , 2024 | 08:34 PM