Prayagraj: రసూలాబాద్ ఘాట్‌కు చంద్ర శేఖర్ ఆజాద్ పేరు.. యోగి మరో ఘనత
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:28 PM
రసూలాబాద్ ఘాట్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరణించిన వ్యక్తుల అంత్యక్రియులు ఇక్కడ నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి.
లక్నో: యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగరాజ్‌లోని గంగానది ఒడ్డున ఉన్న రసూలాబాద్ (Rasulabad Ghat) ఘాట్ పేరును చంద్రశేఖర్ ఆజాద్ (Chandra Shekhar Azad) ఘాట్‌గా మార్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రయాగరాజ్ కార్పొరోషన్ తాజాగా పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేసింది. పేరు మార్పు నిర్ణయంపై లాంఛనమైన ఉత్తర్వులు వారం రోజుల్లో జారీ అవుతాయి. పేరు మార్పు ఫలకాన్ని కూడా ఘాట్ వద్ద ఏర్పాటు చేస్తారు.
Eknath Shinde: సీఎం ఎవరో తేలేది అప్పుడే.. సస్పెన్స్‌కు షిండే తెర
రసూలాబాద్ ఘాట్‌కు చారిత్రక ప్రాధాన్యత ఉంది. మరణించిన వ్యక్తుల అంత్యక్రియులు ఇక్కడ నిర్వహిస్తుంటారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్ర శేఖర్ ఆజాద్ అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. ఘాట్‌కు ఆయన పేరు పెట్టాలనే డిమాండ్ ఇప్పటిదికాదు. ఆజాద్ గౌరవార్దం ఈ ఘాట్‌కు ఆయన పేరు పెట్టాలని 1991లో ప్రయాగరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. అయితే అది ఆమోదం పొందడానికి మాత్రం మూడుదశాబ్దాలు పైనే పట్టింది.
యోగి ఆదిత్యనాథ్ 2024 నవంబర్ 27న ప్రయాగరాజ్ వెళ్లినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించారు. అప్పుడు ఈ విషయాన్ని పలువురు కౌన్సిలర్లు ఆయన దృష్టికి తెచ్చారు. దాంతో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాగరాజ్ మేయర్ గణేష్ కేసెర్వాణి, మున్సిపల్ కౌన్సిలర్ చంద్రమోహన్ గార్గ్‌లకు సీఎం ఆదేశాలిచ్చారు. ఘాట్‌కు చంద్రశేఖర్ ఆజాద్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇది దేశ స్వాతత్ర్యం కోసం అమరులైన వారి వారసత్వాన్ని, జ్ఞాపకాలను పదిలం చేసుకోవడం, వారిని గౌరవించడం అవుతుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
Mohan Bhagwat: సంతానోత్పత్తి రేటు తగ్గుదలపై మోహన్ భగవత్ ఆందోళన
Fire Accident: 61 మంది భక్తులతో వెళ్తున్న బస్సుకు భారీ అగ్ని ప్రమాదం.. చివరకు..
Heavy Raind: చెన్నై నగరాన్ని ముంచెత్తిన ‘ఫెంగల్’..
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 01 , 2024 | 06:28 PM