Exit Polls 2024: మళ్లీ మోదీకే పట్టం.. ఎన్డీయేకే విజయావకాశాలు ఎక్కువంటున్న ఎగ్జిట్ పోల్స్!
ABN, Publish Date - Jun 01 , 2024 | 07:11 PM
సుదీర్ఘంగా ఏడు దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం తుది పోలింగ్ కూడా ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మళ్లీ ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఊహిస్తున్నాయి. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని పదవిని అధిరోహిస్తారని చెబుతున్నాయి.
సుదీర్ఘంగా ఏడు దశల్లో సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం తుది పోలింగ్ కూడా ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మళ్లీ ఎన్డీయేనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఊహిస్తున్నాయి. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని పదవిని అధిరోహిస్తారని చెబుతున్నాయి. రిపబ్లిక్-పీ మార్క్, ఇండియా న్యూస్- డీ డైనమిక్స్, రిపబ్లిక్ భారత్ మొదలైన సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి 350కి పైగా స్థానాలు సంపాదిస్తుందని ప్రకటించాయి.
రిపబ్లిక్ భారత్-పి మార్క్ అంచనా ప్రకారం ఎన్డీయే 359 సీట్లు, ఇండియా కూటమి 154, ఇతరులు 30 సీట్లు గెలుచుకుంటారు. రిపబ్లిక్-మాట్రైజ్ ప్రకారం.. ఎన్డీయే 353-368 సీట్లు, ఇండియా కూటమి 118, ఇతరులు 43-48 సీట్లు గెలుచుకుంటారు. ఇండియా న్యూస్-డి-డైనమిక్స్ అంచనా ప్రకారం.. ఎన్డీయే 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు, ఇతరులు 47 సీట్లు గెలుచుకుంటారు.
అలాగే జన్‌కీ బాత్ సర్వే కూడా ఎన్డీయేకే ఓటు వేసింది. ఆ సర్వే ప్రకారం.. ఎన్డీయే 362-392 సీట్లు, ఇండియా కూటమి 141-161 సీట్లు, ఇతరులు 10-20 సీట్లు గెలుచుకుంటారు. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్ ప్రకారం ఎన్డీయే 365 సీట్లు, ఇండియా కూటమి 142 సీట్లు, ఇతరులు 36 సీట్లు గెలుచుకుంటారు.
ఇది కూడా చదవండి..
మరిన్ని ఎన్నికల వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 01 , 2024 | 07:14 PM