ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

President Droupadi Murmu: కోల్‌కతా ఘటన భయానకం.. రాష్ట్రపతి తొలి స్పందన

ABN, Publish Date - Aug 28 , 2024 | 04:03 PM

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు.మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు.

న్యూఢిల్లీ: కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు. ఇక జరిగింది చాలు...అని పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు. అక్కాచెల్లెళ్లు, కుమార్తెలు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదని చెప్పారు.

Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్ష.. 10 రోజుల్లో బిల్లు


''ఒకవైపు విద్యార్థులు, డాక్టర్లు, పౌరులు కోల్‌కతాలో నిరసనలు చేపడుతుంటే మరోవైపు నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అకృత్యాల‌కు ఏ నాగ‌రిక స‌మాజం కూడా త‌మ కూతుళ్లు, సోద‌రీమ‌ణుల‌ను బ‌లి ఇవ్వదు. ఇలాంటి నీచమైన ఘటనల విషయంలో స‌మాజం త‌న‌ను తాను ఆత్మప‌రిశీల‌న చేసుకోవాలి. నిర్భయ ఘ‌ట‌న జ‌రిగిన 12 ఏళ్ల కాలంలో స‌మాజం ఎన్నో అత్యాచార ఘ‌ట‌న‌ల‌ను మ‌రిచిపోయింది. ఇటువంటి సామూహిక మ‌తిమ‌రుపు అసహ్యకరమైనది. గ‌త త‌ప్పుల‌ను ఎదుర్కొనేందుకు స‌మాజం భ‌య‌ప‌డుతోంది. కానీ ఇప్పుడు చ‌రిత్రను స‌మూలంగా మార్చేందుకు సమ‌యం ఆస‌న్నమైంది. స‌మగ్రమైన రీతిలో ఈ స‌మస్యను నిర్మూలించేందుకు ప్రయత్నిద్దాం'' ఆమె పేర్కొన్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 04:03 PM

Advertising
Advertising
<