Padma Awards: రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ స్వీకరించిన వెంకయ్య
ABN, Publish Date - Apr 22 , 2024 | 09:36 PM
పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
ఢిల్లీ: పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్‌లో సోమవారం ఘనంగా జరిగింది. 132 పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 110 పద్మ శ్రీ అవార్డులు ఉండగా, 17 పద్మభూషణ్ అవార్డులు ఉన్నాయి. 5 పద్మవిభూషణ్ అవార్డులు ఉన్నాయి.
పద్మాలు వీరే
రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ తరఫున కుటుంబ సభ్యులకు పద్మవిభూషణ్ అవార్డు అందజేశారు. సినీ నటుడు మిథున్ చక్రవర్తి, మాజీ గవర్నర్ రామ్ నాయక్, ప్రముఖ గాయనీ ఉషా ఉథుప్ పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని నారాయణ పేటకు చెందిన బుర్ర వీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు. ఈ రోజు సగం మందికి అవార్డులను ప్రదానం చేశారు. అవార్డుల ప్రదానోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
CM Revanth Reddy: కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..
Read Latest Politics News or Telugu News
Updated Date - Apr 22 , 2024 | 09:36 PM