ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi: ఈ శుభ సందర్భంలో నా మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది.. ప్రధాని మోదీ

ABN, Publish Date - Apr 17 , 2024 | 10:59 AM

శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు.

శ్రీరామనవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలోని రామాలయంలో రాం లల్లా కొలువుదీరిన తరువాత ఇదే తొలి రామనవమి అని అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించి రామ మందిరంలో బాల రాముడిని పూజించే భాగ్యం లభించిందని ప్రధాని చెప్పారు. రామనవమి సందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబసభ్యులకు చిరకాల శుభాకాంక్షలు.! ఈ శుభ సందర్భంలో నా హృదయం భావోద్వేగం, కృతజ్ఞతతో నిండిపోయాయి. ఈ ఏడాది నేనూ, లక్షలాది మంది నా దేశ ప్రజలు అయోధ్యలో రామ్ మందిరాన్ని దర్శించుకున్నాం. ఈ జ్ఞాపకాలు ఇప్పటికీ నాలో శక్తిని నింపుతాయి" అని ప్రధాని ట్వీట్ చేశారు.


Hyderabad: ఊపిరాడని ప్రయాణం.. మండే ఎండల్లో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు

అయోధ్య రామ మందిరంలో రాంలల్లాను ప్రతిష్టించిన తర్వాత ఇదే మొదటి రామనవమి అని ప్రధాని మోదీ అన్నారు. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించిన తర్వాత ఈరోజు అయోధ్యలో పండుగను జరుపుకునే భాగ్యం లభించిందని చెప్పారు. శ్రీరాముని జీవిత విశేషాలు, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ఆధారంగా నిలుస్తాయని కొనియాడారు. ఆయన ఆశీస్సులు స్వావలంబన భారతదేశ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని తెలిపారు.


Hyderabad: ఎంఎంటీఎస్ - ఆర్టీసీ కంబైన్డ్‌ పాస్‌ రూ.1,350

అయోధ్యలోని బాల రాముడి దర్శనం కోసం అయోధ్యకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. రాంలల్లా సూర్య తిలకాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఎదురు చూస్తున్నారు. శ్రీరాముడు జన్మించిన 12.16 గంటల శుభ ముహూర్తాన సూర్య కిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు విగ్రహం నుదుటిపై పడతాయి. ఇందుకోసం శాస్త్రవేత్తలు సన్నాహాలూ పూర్తి చేశారు. ఈ సమయంలో రాంలల్లాకు 56 రకాల నైవేద్యాలు కూడా సమర్పించనున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 17 , 2024 | 12:11 PM

Advertising
Advertising