Priyanka Gandhi: మేము బరిలో దిగితే.. ఆ పార్టీకి లాభం..?
ABN, Publish Date - May 18 , 2024 | 05:28 PM
ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అందువల్లే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
న్యూఢిల్లీ, మే 18: ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించానని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. అందువల్లే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను, సోదరుడు రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో దిగితే బీజేపీ లాభ పడుతుందని అభిప్రాయపడ్డారు అయితే అమేఠీ, రాయ్‌బరేలీని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వదులుకోదని ఈ సందర్బంగా ప్రియాంక పేర్కొన్నారు.
kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..
శనివారం న్యూఢిల్లీలో ప్రియాంక గాంధీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా మీరు.. ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ప్రియాంక గాంధీ పైవిధంగా సమాధానమిచ్చారు.
గత పక్షం రోజులుగా రాయ్‌బరేలీలో తాను ప్రచారం చేస్తున్నానని తెలిపారు. అలాగే రాయ్‌బరేలీతో గాంధీ ప్యామిలీకి గతం నుంచి సంబంధాలు ఉన్నాయని.. అవి కొనసాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. తాము రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించకపోయినా.. తాము ఇక్కడికి వస్తామని.., ప్రజలను కలుస్తామని.. వారితో మమేకమవుతాని ఈ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం తమపై అంత నమ్మకముందన్నారు.
Swati Maliwal: స్వాతి మలివాల్ గాయాలపై ఎయిమ్స్ నివేదిక
కేరళలోని వాయ్‌నాడ్ నుంచే కాకుండా గాంధీ ఫ్యామిలీకి కంచుకోట రాయ్‌బరేలీ నుంచి సైతం రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో నిలిచారని ఈ సందర్బంగా ప్రియాంక గుర్తు చేశారు.
రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి తన తల్లి సోనియాగాంధీ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అయితే ఈ ఏడాది తొలినాళ్లలో ఆమె రాజ్యసభకు వెళ్లారని వివరించారు. తాను రాయ్‌బరేలీలో, రాహుల్ అమేఠీలో 15 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే.. దేశవ్యాప్తంగా పార్టీ తరఫున ప్రచారాన్ని ఎవరు నిర్వహిస్తారని ప్రియాంక ఈ సందర్బంగా ప్రశ్నించారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయడంపైన కానీ.. పార్లమెంటేరియన్ కావడంపై కానీ ఆలోచన లేదన్నారు.
Bihar: దంపతులు ఆత్మహత్య: పోలీస్‌స్టేషన్‌పై బంధువుల దాడి
కానీ పార్టీ తనకు ఏ పని చేయమంటే.. ఆ పని చేసేందుకు తాను సిద్దమని ప్రియాంక గాంధీ ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే.. అ క్రమంలో ఎన్నికల బరిలో దిగుతానని ప్రియాంక స్పష్టం చేశారు. మరోవైపు ప్రియాంక గాంధీ ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని.. అందుకే ఆమె ఎన్నికల బరిలో దిగలేదంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఈ సందర్బంగా ఆమె ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఏమి బీజేపీ చెప్పినట్లు నడుచుకోవడం లేదని.. బీజేపీ విమర్శలను ఖండించారు.
ఇక అమేఠీని రాహుల్ గాంధీ వదిలి.. రాయ్ బరేలీని ఎంచుకోవడంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ప్రియాంక తిప్పికొట్టారు. 2014లో ప్రధాని మోదీ గుజరాత్‌లోని వడోదరలో పోటీ చేశారని గుర్తు చేశారు. అనంతరం ఆయన వారణాసి నుంచే ఎన్నికల బరిలో నిలుస్తున్నారని తెలిపారు. అంటే మోదీ వడోదరను భయంతో వదిలివేశారా?అని ప్రియాంక ప్రశ్నించారు.
Nagababu: నాగబాబు రీ ఎంట్రీ.. వివాదం ముగిసినట్లేనా?
ఇక గత ఎన్నికల్లో అమేఠీ నుంచి బరిలో దిగిన రాహుల్ గాంధీ.. బీజేపీ అభ్యర్థి స్మృతీ ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ క్రమంలో అమేఠీలో మరోసారి రాహుల్ బరిలో దిగితే ఇరానీ చేతిలో ఓటమి తప్పదని భయపడ్డారని .. అందుకే రాహుల్ గాంధీ ఈ సారి రాయబరేలి నుంచి బరిలో దిగారంటూ బీజేపీ ఆరోపణలు సందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ పైవిధంగా స్పందించారు.
Read Latest National News and Telugu News
Updated Date - May 18 , 2024 | 05:28 PM