ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Priyanka Gandhi: మదర్ థెరిస్సా మా ఇంటికి వచ్చారు.. నాటి జ్ఞాపకాలను పంచుకున్న ప్రియాంక

ABN, Publish Date - Oct 28 , 2024 | 05:33 PM

మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్‌కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు.

న్యూఢిల్లీ: వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ప్రముఖ సంఘసేవకురాలు, నోబెల్ బహుమతి గ్రహీత దివంగత మదర్ థెరిస్సాతో (Mother Teresa) తన జ్ఞాపకాలను సోమవారంనాడు నెమరువేసుకున్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ హత్యానంతరం తాను విషాదంలో మునిగిపోయినప్పుడు మదర్ తనను ఓదారుస్తూ చెప్పిన మాటలు, ఆ తర్వాత మదర్ ఛారిటబుల్ ఆర్గనైజేషన్‌కు తాను అందిస్తూ వచ్చిన సేవలను ఆమె తొలిసారి బహిరంగంగా వెల్లడించారు.

PM Modi: ఫుట్‌బాల్ అంటే మాకూ ఇష్టమే: ప్రధాని మోదీ


మదర్ థెరిస్సా 1991లో తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యానంతరం తమ కుటుంబసభ్యులను కలిసేందుకు రావడం, ఢిల్లీలోని మదర్ ఛారిటబుల్ ఆర్గనేజేషన్‌కు సేవలందించాలని ఆహ్వానించిన వైనాన్ని ప్రియాంక గుర్తు చేసుకున్నారు. "నాకు 19 ఏళ్ల వయస్సులో మా తండ్రిగారు కాలం చేశారు. అప్పుడు మదర్ థెరిస్సా మా తల్లిగారిని (సోనియాగాంధీ) కలుసుకునేందుకు వచ్చారు. ఆ రోజు నాకు జ్వరం రావడంతో గదిలోనే ఉండిపోయాను. మదర్ స్వయంగా నా గదిలోకి వచ్చి నా తలపై చేతులు ఉంచారు. నిరుపేదల కోసం పనిచేయాలని నన్ను ఆహ్వానించారు. అప్పట్నించి ఢిల్లీలోని థెరిసా ఆర్గనైజేషన్ సోదరీమణులతో కలిసి బాత్‌రూమ్‌లు శుభ్రం చేయడం, వంట చేయడం వంటపాత్రలు శుభ్రం చేయడం, పిల్లల్ని బయటకు తీసుకువెళ్లడం చేసేదాన్ని. వారితో కలిసి పనిచేయడం ద్వారా వారి సాదకబాధకాలు తెలుసుకోడవం, సేవ అంటే ఏమిటో తెలుసుకోగలిగాను'' అని ప్రియాంక అన్నారు.


వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు మీరు ఒకరికొకరు ఏవిధంగా సహాయపడ్డారో కూడా చాశానని, మదర్ మాటలను వీరు రుజువు చేశారని వయనాడ్ ప్రజలను ప్రియాంక అభినందించారు. నామినేషన్ వేసేందుకు వచ్చినప్పుడు వయనాడ్‌లోని ఓ ఆర్మీ అధికారి తల్లి తన తలపై చేయి ఉంచి ఆశీర్వదించడం, చూపిన అభిమానం ఎన్నటికీ మరువలేనన్నారు. ప్రజల అవసరాలు ఏమిటో ఇప్పుడిప్పుడే తాను తెలుసుకోగలుగుతున్నానని, ప్రజల ముందుకు వచ్చి అందర్నీ కలుస్తానని, ప్రజాసమస్యలు గ్రహించి తన బాధ్యతపై అవగాహన తెచ్చుకుంటానని అన్నారు. వయనాడ్ ప్రజలు తన సోదరుడు రాహుల్‌ గాంధీపై చూపిన అభిమానం ఎన్నటికీ మరువలేనని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలి, వయనాడ్‌లలో గెలిచిన రాహుల్ గాంధీ నిబంధనల ప్రకారం వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకోవడంతో అక్కడ నవంబర్ 13న ఉప ఎన్నిక జరుగుతోంది.


ఇవి కూడా చదవండి...

టాటా-ఎయిర్‌బస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

INDIA Alliance: కాంగ్రెస్-లెఫ్ట్‌ మధ్య సీట్ల చిచ్చు!

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 28 , 2024 | 05:39 PM