ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Priyanka Gandhi: జమిలీ జేపీసీ కమిటీలో ప్రియాంక

ABN, Publish Date - Dec 18 , 2024 | 05:30 PM

జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రెండు బిల్లులను (129వ రాజ్యాంగ సవరణ) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు నియంతృత్వానికి దారితీస్తుందని విపక్షాలు వ్యతిరేకించాయి.

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల (One Nation, One Elections Bill) రాజ్యాంగ సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపిన నేపథ్యంలో బిల్లును పరిశీలించే జేపీసీ నామినీ జాబితాలో కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ పేరు ఉన్నట్టు తెలుస్తోంది. లోక్‌సభ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖ్‌దేవ్ భగవత్, రాజ్యసభ నుంచి రణ్‌దీప్ సూర్జేవాలా పేర్లు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కమిటీలో సభ్యులుగా కల్యాణ్ బెనర్జీ, సాకేత్ గోఖలేల పేర్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్టు సమాచారం.

Privilege Notice: ముసుగు తొలగింది.. అమిత్‌షాపై టీఎంసీ ప్రివిలిజ్ నోటీస్


జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు రెండు బిల్లులను (129వ రాజ్యాంగ సవరణ) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు నియంతృత్వానికి దారితీస్తుందని విపక్షాలు వ్యతిరేకించగా, రాష్ట్రాల హక్కులకు ఎలాంటి భంగం కలగదని మేఘవాల్ స్పష్టం చేశారు. గంటన్నర సేపు బిల్లుపై చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించగా, అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. అనంతరం దీనిపై సమగ్ర పరిశీలనకు బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు.


బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లును వ్యతిరేకించారు. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని అన్నారు. తక్షణం బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తివారీ బాటలోనే పలువురు విపక్ష నేతలు ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. ఎస్‌పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు బిల్లును వ్యతిరేకించిన వారిలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

Jammu and Kashmir: ఊపిరందక ఆరుగురి మృతి.. నలుగురికి తీవ్రగాయాలు

Rahul Gandhi:ఆల్‌టైం హైకి వాణిజ్య లోటు.. కేంద్రంపై రాహుల్ ఫైర్

For National News And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 05:33 PM