ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puja Khedkar: విచారణకు ముందే దోషిగా తేల్చడం తప్పు.. తొలిసారి స్పందించిన పూజా ఖేద్కర్

ABN, Publish Date - Jul 15 , 2024 | 08:59 PM

అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సోమవారంనాడు తొలిసారి స్పందించారు. మీడియా విచారణను తప్పుపట్టారు. మీడియా తనంత తానుగా విచారణ జరిపి తనను దోషిగా నిర్ధారించడం తప్పని అన్నారు.

పుణె: అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ (Puja Khedkar) సోమవారంనాడు తొలిసారి స్పందించారు. మీడియా విచారణను తప్పుపట్టారు. మీడియా తనంత తానుగా విచారణ జరిపి తనను దోషిగా నిర్ధారించడం తప్పని అన్నారు. 34 ఏళ్ల ఖేద్కర్ తప్పుడు పద్ధతుల్లో సివిల్ సర్వీస్ పరీక్షలు పూర్తి చేసుకుందని, నాన్ క్రీమీలేయర్ ధ్రువీకరణ పత్రం సమర్పించి వైద్యకళాశాలలో చేరారని పలు ఆరోపణలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.


కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై పూజా ఖేద్కర్ తొలిసారి మాట్లాడుతూ.. ''మన రాజ్యాంగం ప్రకారం దోషిగా నిరూపణ అయ్యేంత వరకూ ఎవరైనా నిరపరాధులే. మీడియా ట్రయిల్‌ నన్ను దోషిగా పేర్కొనడం తప్పు. ఇది ప్రతి ఒక్కరి హక్కు. ఇవన్నీ ఆరోపణలని మీరే చెబుతూ దోషిగా ప్రూవ్ అయినట్టు మాట్లాడటం తప్పు'' అని అన్నారు. నిపుణుల కమిటీ ముందు తాను సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధమని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉటానని చెప్పారు. కమిటీ ముందు తాను చెప్పదలచుకున్నది చెబుతానని, సత్యం ఏమిటో అప్పుడు బయటకు వస్తుందని అన్నారు. ఒక ట్రైనీగా ప్రస్తుతం పనిచేయడం, విషయాలు తెలుసుకోవడమే తన డ్యూటీ అని, అదే చేస్తున్నానని చెప్పారు. దర్యాప్తుపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని అన్నారు. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది పబ్లిక్‌కు తెలుస్తుందని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నందుకు ఇంతకముందు మాట్లాడే హక్కు తనకు లేదని చెప్పారు.

Pune Police: పరారీలో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు


ఎంబీబీఎస్‌పై వివాదం

కాగా, పూజా ఖేద్కర్ ఎంబీబీఎస్ చదివేందుకు కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు వాడినట్టు తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చిది. పుణెలోని శ్రీమతి కాశీబాయి నవలె మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్‌లో 2007లో ఎన్‌టీ-3 కేటగిరి కింద నాన్ క్రీమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణ పత్రంతో ఆమె సీటు పొందారు. ఈ విషయాన్ని మెడికల్ కాలేజీ డైరెక్టర్ అరవింద్ బొహ్రె ధ్రువీకరించారు. బొహ్రె చెప్పిన వివరాల ప్రకారం, అసోసియేషన్ ఆఫ్ మేనిజిమెట్ ఆఫ్ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటర్ కాలేజెస్ ఆఫ్ మహారాష్ట్ర ప్రవేశపరీక్ష రాసి పూజ ఖేద్కర్ మెడికల్ కాలేజీలో సీటు తెచ్చుకున్నారు. 200 మార్కులకు 146 మార్కులు సాధించారు. 2007లో కాలేజీ ఫస్ట్ బ్యాచ్‌లో ఎన్‌రోల్ చేయించుకున్నారు. నాన్ క్రీమీలేయర్ ధ్రువీకరణ పత్రం సమర్పిచి వైద్య కళాశాలలో చేరారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 15 , 2024 | 09:02 PM

Advertising
Advertising
<