ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puja Khedkar controversy: పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల 'వైవాహిక స్థితి' ఏంటి?.. వివరాలు కోరిన కేంద్రం

ABN, Publish Date - Jul 24 , 2024 | 04:52 PM

ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి''పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

న్యూఢిల్లీ: ఐపీఎస్ ట్రైనీ (IPS trainee) పూజా ఖేడ్కర్ (Puja Khedkar) చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి'' (Marital status)పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. యూపీఎస్‌సీ పరిక్షల్లో ఓబీసీ నాన్-క్రీమీలేయర్ కోటా కోసం పూజా కేడ్కర్ తన తల్లిదండ్రులు విడిపోయారని క్లెయిమ్ చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలు కంటే తక్కువ ఉంటేనే ఓబీసీ నాన్-క్రీమీ లేయర్ కోటా వర్తిస్తుంది. తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నారని, తాను తన తల్లి దగ్గర ఉంటున్నారని పూజా కేడ్కర్ క్లెయిమ్ చేసుకున్నారు. ఆమె తండ్రి ప్రభుత్వ ఉద్యోగంలో క్లాస్ వన్ ఆఫీస్‌ర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో స్పష్టత కోసం ఖేడ్కర్ తల్లిదండ్రుల వైవాహిక స్థితిపై వివరాలు ఇవ్వాలని పుణె పోలీసులకు కేంద్రం ఆదేశాలిచ్చింది.


పుణె జిల్లా కలెక్టరేట్‌లో శిక్షణ సమయంలో పూజా కేడ్కర్ నిబంధనలకు విరుద్ధంగా పెర్క్‌లు, సౌకర్యాలు డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. ప్రైవేటు వాహనంపై ఎర్రబుగ్గను ఏర్పాటు చేసుకోవడం, దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం పేరు రాసి ఉండటం మరింత వివాదమైంది. ఈ క్రమంలో ఆమె ప్రొబేషన్‌ను నిలిపివేల తిరిగి అకాడమీకి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జూలై 23వ తేదీలోగా ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి రావాలని ఆదేశించారు. మరోవైపు, అధికార దుర్వినియోగం, యుపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం వంటి ఆరోపణలు రావడంతో ఆమెపై ఉన్నతాధికారులు చర్యలకు దిగారు.


యుపీఎస్‌సీ చర్యలు

పూజా కేడ్కర్ నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన మోసానికి పాల్పడినట్టు యూపీఎస్‌సీ ఇటీవల ధ్రువీకరిస్తూ చర్యలకు దిగింది. క్రిమినల్ కేసు నమోదు చేసింది. 2022 యుపీఎస్‌సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో మళ్లీ నియామక పరీక్షలు రాయకుండా డిబార్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసు ఇచ్చింది. కేడ్కర్ తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా పత్రాలను మార్చడం ద్వారా మోసపూరిత చర్యలకు పాల్పడినట్టు యూపీఎస్‌సీ పేర్కొంది.

Anti-Paper Leak Bill: నీట్ పేపర్ లీక్ వివాదం.. బిహార్ ప్రభుత్వం కీలక బిల్లు.. రూ.10 లక్షలతో సహా జైలు శిక్ష


కాగా, ఖేడ్కర్ తల్లి మనోరమ క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. 2023లో ఒక భూ వివాదం కేసులో ఒక వ్యక్తిని ఆమె తుపాకీతో బెదిరించిందనే కారణంగా పుణె రూరల్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిటైర్డ్ ప్రభుత్వాధికారి అయిన ఖేడ్కర్ తండ్రి దిలీప్ కూడా ఈ కేసులో నిందితుడుగా ఉన్నాడు. అయితే ఆయనను జూలై 25వ తేదీ వరకూ అరెస్టు చేయకుండా పుణె కోర్టు తాత్కాలిక రక్షణ కల్పించింది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 24 , 2024 | 04:54 PM

Advertising
Advertising
<