ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puja Khedkar: పూజా ఖేడ్కర్‌కు మరో ఎదురుదెబ్బ... ట్రైనింగ్ నిలుపుదల

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:48 PM

అధికార దుర్వినియోగం, యూపీఎస్‌సీకి తప్పుడు అవిడవిట్ సమర్పించడం సహా పలు ఆరోపణలతో చిక్కుల్లో పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. పూజా ఖేడ్కర్ ట్రైనింగ్‌ను నిలుపుదల చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు తెలిపింది.

ముంబై: అధికార దుర్వినియోగం, యూపీఎస్‌సీకి తప్పుడు అవిడవిట్ సమర్పించడం సహా పలు ఆరోపణలతో చిక్కుల్లో పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ (Puja Khedkar) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. పూజా ఖేడ్కర్ ట్రైనింగ్‌ను నిలుపుదల చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు తెలిపింది. ఈనెల 23వ తేదీలోగా ఆమె ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ఆకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌కు తిరిగి రావాలని ఆదేశాలు జారీ అయినట్టు పేర్కొంది. అధికార దుర్వినియోగం ఆరోపణలతో ఇటీవల పుణె నుంచి వాసింకు పూజా ఖేడ్కర్‌ బదిలీ అయ్యారు.

Pune : పరారీలో ట్రైనీ ఐఏఎస్‌ పూజా తల్లిదండ్రులు


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కి ఖేడ్కర్ తప్పుడు అఫిడవిట్లు సమర్పించిందన్న ఆరోపణలు రావడంతో ప్రస్తుతం వాటి వెరిఫికేషన్ జరుగుతోంది. ఆమె దృష్టిలోపం అంశంపైనా దర్యా్ప్తు జరుగుతోంది. ఖేడ్కర్ గతంలో అహ్మదాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి 2018, 2021 ఇచ్చిన రెండు సర్టిఫికెట్లను యూపీఎస్‌సీకి సమర్పించింది. పెర్సన్స్ విత్ బెంచ్‌మార్క్ డిసేబిలిటీ (పీడబ్ల్యూబీడీ) కేటగిరి కింద ఈ సర్టిఫికెట్లను యూపీఎస్‌సీకి ఆమె అందజేశారు. 2022లో పుణెలోని అనుథ్ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి డిసేబిలిటీ సర్టిఫికెట్‌‌కు దాఖలు చేసుకోగా, వైద్య పరీక్షల అనంతరం ఆమె అప్లికేషన్‌ను తోసిపుచ్చారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై ఖేడ్కర్ సోమవారంనాడు తొలిసారి స్పందిస్తూ, ప్రస్తుతం తాను ట్రయినింగ్‌లో ఉన్నానని, తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదని చెప్పారు. దర్యాప్తు అనంతరం నిజం ఏమిటో అందరికీ తెలుస్తుందని, దర్యాప్తు కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలో పూజా ఖేడ్కర్ ట్రయినింగ్‌ను నిలుపుదల చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 16 , 2024 | 07:50 PM

Advertising
Advertising
<