ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pune : పుణె మునక

ABN, Publish Date - Aug 05 , 2024 | 04:12 AM

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె వద్ద ఖడక్‌వాస్లా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

  • ముంచెత్తిన ఖడక్‌వాస్లా డ్యాం నీరు

  • సహాయక చర్యలు చేపట్టిన సైన్యం

  • నాసిక్‌ వద్ద గోదావరి ఉరకలు

  • ముంపు ప్రాంతాలు అప్రమత్తం

  • మధ్యప్రదేశ్‌లో ఇంటి గోడ కూలి

  • 9 మంది చిన్నారుల దుర్మరణం

  • హిమాచల్‌లో 11కు చేరిన మృతులు

  • గల్లంతైన 40 మంది కోసం గాలింపు

  • ఉత్తరాదిన వర్ష బీభత్సం

పుణె, నాసిక్‌, సాగర్‌(ఎంపీ), సిమ్లా, ఆగస్టు 4: భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె వద్ద ఖడక్‌వాస్లా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలతో డ్యాం నుంచి ఆదివారం 35వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

దీంతో ఏక్తానగర్‌ పరిధిలోని నివాస ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించడానికి పుణె జిల్లా మేజిస్ట్రేట్‌ సైన్యం సాయం కోరారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌, పుణె, సతారా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. థానే, ముంబై, రాయ్‌గఢ్‌, సింధుదుర్గ్‌, నాసిక్‌లలో అరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఇక నాసిక్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలతో పాటు గోదావరి ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.


మరోవైపు మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న ఇంటి గోడ కూలిన ఘటనలో 9మంది చిన్నారులు మృతిచెందారు. రెహ్లీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి షాపూర్‌ గ్రామంలో ఆదివారం ఉదయం 8.30 నుంచి 9గంటల మధ్య ‘పార్థివ లింగ నిర్మాణ్‌’ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ఆలయ సమీపంలో వేసిన గుడారం కింద పిల్లలంతా కూర్చున్నారని, వర్షాల కారణంగా అక్కడున్న ఓ ఇంటి గోడ కూలి గుడారంపై పడిందని అధికారులు వెల్లడించారు.

గుడారం, శిథిలాల కింద నలిగి పిల్లలు చనిపోయారని స్థానికులు తెలిపారు. మృతులంతా 10 నుంచి 15 ఏళ్లలోపు వయసు వారే. ఇదిలా ఉండగా, ఈశాన్య మధ్యప్రదేశ్‌లో తీవ్ర అల్పపీడనం, పశ్చిమ రాజస్థాన్‌లో అల్పపీడనం కారణంగా బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల అనేక మంది యాత్రికులు కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. 4రోజుల్లో సుమారు 400 మంది భక్తులను రక్షించినట్లు తెలిపారు.

Updated Date - Aug 05 , 2024 | 04:12 AM

Advertising
Advertising
<