ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi : బైడెన్‌లాగే మోదీకీ మతిమరుపు..

ABN, Publish Date - Nov 17 , 2024 | 03:40 AM

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ లాగే ప్రధాని మోదీ కూడా జ్ఞాపకశక్తి కోల్పోయారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ మాట్లాడే విషయాలపైనే ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ లాగే ప్రధాని మోదీ కూడా జ్ఞాపకశక్తి కోల్పోయారని రాహుల్‌ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ మాట్లాడే విషయాలపైనే ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శనివారం మహారాష్ట్రలోని అమరావతిలో ఎన్నికల ర్యాలీలో రాహుల్‌ మాట్లాడారు. ‘బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని.. హక్కులను హరిస్తోందని గతేడాది కాలంగా నా ప్రసంగాల్లో చెబుతుంటే.. కాంగ్రెస్సే రాజ్యాంగంపై దాడి చేస్తోందని మోదీ అంటున్నారు. కాంగ్రెస్‌, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 50ు రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తానని లోక్‌సభలో చెప్పాను. కానీ రాహుల్‌ గాంధీనే రిజర్వేషన్లకు వ్యతిరేకమని మోదీ ఇప్పటికీ అంటున్నారు. అందుకే ఆయనకు మతిమరుపు వచ్చినట్లనిపిస్తోంది. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి. ఏమో.. వచ్చే సమావేశంలో కులగణనకు రాహుల్‌ గాంధీనే వ్యతిరేకమని మోదీ చెప్పినా చెబుతారు’ అంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు హెలికాప్టర్‌లో రాహుల్‌ అమరావతి చేరుకోగానే.. ఆయన బ్యాగులను ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు.

Updated Date - Nov 17 , 2024 | 03:40 AM