ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: వయనాడ్ నుంచి నామినేషన్ వేసిన రాహుల్..

ABN, Publish Date - Apr 03 , 2024 | 06:58 PM

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేరళలోని వయనాడ్ (Wayanad) నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. ప్రస్తుతం వయనాడ్ ఎంపీగా ఉన్న ఆయన తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా హాజరయ్యారు. వయనాడ్ నుంచి సీపీఐ అభ్యర్థిగా అన్నే రాజా, బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ పోటీ చేస్తున్నారు.


మడం తిప్పను..

ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగేంత వరకూ తాను, 'ఇండియా' కూటమి సభ్యులంతా అవిశ్రాంత పోరాటం సాగిస్తామని రాహుల్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. భరతమాత వాణిని అణిచివేసే విద్వేష, అవినీతి, అన్యాయ శక్తులపై జరుపుతున్న పోరాటం ఈ ఎన్నికలని అన్నారు. నామినేషన్ వేయడానికి ముందు వయనాడ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిపే పోరాటం ఈ ఎన్నికలని అన్నారు. దేశ ప్రజాస్వా్మ్య వ్యవస్థపై, రాజ్యాంగంపై దాడి జరుపుతున్న శక్తులెవరో ప్రజలందరికీ తెలుసునని బీజేపీపై విమర్శలు గుప్పించారు. హ్యూమన్-యానిమల్ కాన్‌ఫ్లిక్ట్‌‌తో (మెడికల్ కాలేజీ అంశం) సహా వయనాడ్ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లవేళలలా అందుబాటులో ఉంటానని, వయనాడ్ సమస్యలను ఇప్పటికే దేశం, ప్రపంచం దృష్టికి తెచ్చానని అన్నారు. మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు్న్నామని, సీఎంకు లేఖలు సైతం రాశానని చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తూ ఆ సమస్య అక్కడ్నించి ముందుకు కదలలేదన్నారు. అటు ఢిల్లీ, ఇటు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడితే అన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయని సూచించారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 03 , 2024 | 08:21 PM

Advertising
Advertising