సిద్దరామయ్యకు రాహుల్ మద్దతు
ABN, Publish Date - Sep 27 , 2024 | 04:22 AM
ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
బెంగళూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ముడా (మైసూర్ నగరాభివృద్ధి సంస్థ) ఇళ్ల స్థలాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సిద్దరామయ్యను లోకాయుక్త విచారించనున్న నేపథ్యంలో వెనుకడుగు వద్దని, మరింత శక్తివంతుడు కావాలని, అండగా ఉంటామని రాహుల్ భరోసా ఇచ్చారు. జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ గురువారం సిద్దరామయ్యకు ఫోన్ చేశారు. కాగా పార్టీ పరువుకోసం సిద్దరామయ్య వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక అసెంబ్లీ మాజీ స్పీకర్ కేబీ కోళివాడ సూచించారు.
Updated Date - Sep 27 , 2024 | 04:22 AM