ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rahul Gandhi: రైతు ప్రతినిధులతో రాహుల్ .. ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ప్రైవేటు బిల్లు తెచ్చే యోచన

ABN, Publish Date - Jul 24 , 2024 | 02:56 PM

పండించిన పంటలపై కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్‌ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది.

న్యూఢిల్లీ: పండించిన పంటలపై కనీస మద్దతు ధర (MSP)కు హామీ ఇచ్చేలా చట్టం చేయాలంటూ రైతులు చిరకాల డిమాండ్‌ ఊపందుకోనుంది. దీనిపై విపక్షాలు ప్రైవేటు మెంబర్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. కాంగ్రెస్ నేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని 12 మంది సభ్యుల రైతు ప్రతినిధుల బృందం బుధవారంనాడు కలుసుకుంది. తమ చిరకాల డిమాండ్ అయిన ఎంఎస్‌పీకు చట్టబద్ధత కల్పించేలా ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని రాహుల్‌ను ప్రతినిధి బృందం కోరినట్టు తెలుస్తోంది.


మరోవైపు, కనీస మద్దతు ధర హామీ చట్టం కోసం తమ కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ప్రకటించాయి. తాజా నిరసనల్లో భాగంగా దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్టు తెలిపింది. విపక్షాల ప్రైవేటు బిల్లుకు మద్దతుగా 'లాంగ్ మార్చ్'కు కూడా సిద్ధమవుతున్నారు.

BJP state president: రాజకీయాల కంటే పోలీస్‌ ఉద్యోగమే మంచిది..


ఆగస్టు 15న ట్రాక్టర్ ర్యాలీ

కాగా, తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్టు రైతు నేతలు ప్రకటించారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రతులను కూడా దగ్ధం చేయనున్నట్టు తెలిపారు. ఆగస్టు 31వ తేదీకి 'ఢిల్లీ ఛలో' మార్చ్ 200 రోజులు పూర్తిచేసుకుంటుందని, పంజాబ్, హర్యానా సరిహద్దులోని ఖనౌరి, శంభు, తదితర ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దార్ మర్చా నేతలు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు.


రైతులను రానీయలేదు..

కాగా, రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, రైతు నేతలను తామే ఆహ్వానించామని, అయితే వారిని ఇక్కడకు (పార్లమెంటుకు) అనుమతించ లేదని చెప్పారు. బహుశా వారు రైతులు కావడమే అందుకు కారణం కావచ్చని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 24 , 2024 | 02:56 PM

Advertising
Advertising
<