ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రలో మార్పులు..

ABN, Publish Date - Feb 11 , 2024 | 04:26 PM

రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ షెడ్యూల్‌లో సవరణలు చోటుచేసుకున్నాయి. యూపీ బోర్డ్ ఎగ్జామ్స్ కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 14వ తేదీకి బదులుగా ఇప్పుడు 16వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోకి అడుగుపెడుతుంది.

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) షెడ్యూల్‌లో సవరణలు చోటుచేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్ కారణంగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. యూపీసీసీ చీఫ్ అజయ్ రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 14వ తేదీకి బదులుగా ఇప్పుడు 16వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోకి అడుగుపెడుతుంది. 27/ 28 తేదీల్లో యూపీని విడిచిపెట్టాల్సి ఉండగా, ముందుగానే 22/23 తేదీల్లో యూపీ నుంచి బుందేల్‌ఖండ్‌కు వెళ్తుంది.


యూపీలో రాహుల్ యాత్ర చాందౌలి నుంచి ప్రారంభమై వారణాసి వెళ్తుంది. భదోహి, ప్రయాగ్‌రజ్ ప్రతాప్‌లో పర్యటించి అమేథి చేరుకుంటుంది. ఆ తర్వాత రాయబరేలి, లక్నోలో పర్యటిస్తుంది. ఫిబ్రవరి 19న అమేధీ, రాయబరేలిలో పర్యటన ఉంటుంది. లక్నో నుంచి సీతాపూర్‌కు వెళ్లే బదులు ఇప్పుడు కాన్పూర్‌, ఝాన్సీ వెళ్లి అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెడుతుంది. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో కార్యకర్తలు బస చేయాల్సి ఉందని, అయితే బోర్డు పరీక్షలు కారణంగా న్యాయ్ యాత్ర షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని రాయ్ తెలిపారు. కాగా, ఇండియా (I.N.D.I.A.) కూటమికి ఆర్ఎల్‌డీ గుడ్‌బై చెప్పడం కూడా పశ్చిమ యూపీలో రాహుల్ పర్యటనకు గండి పడిందని, దీంతో యాత్రలో రీషెడ్యూల్ చోటుచేసుకుందని కూడా చెబుతున్నారు.

Updated Date - Feb 11 , 2024 | 04:26 PM

Advertising
Advertising