ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Doda encounter: ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ABN, Publish Date - Jul 16 , 2024 | 03:25 PM

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉన్నతాధికారి సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడులపై రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.

న్యూఢిల్లీ, జులై 16: జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులతో జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉన్నతాధికారి సహా నలుగురు సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ వ్యాలీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఉగ్రవాద దాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉగ్రదాడులు ఒక దాని తర్వాత ఒకటి చోటు చేసుకోవడం చాలా భయాందోళనలకు గురి చేస్తుందన్నారు. ఈ వరుస ఉగ్రవాద దాడులతో జమ్మూ కశ్మీర్‌లోని పరిస్థితులకు అద్దం పడుతుందని తెలిపారు.

Also Read:Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

భద్రతా లోపాల కారణంగా ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఘటనలకు కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్బంగా రాహుల్ గాంధీ సూచించారు. బీజేపీ తప్పుడు విధానాల కారణంగా.. సైనికులు, వారి కుటుంబాలు బలవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి, సైనికులకు హాని చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశంలోని ప్రతీ దేశభక్తుడు డిమాండ్ చేస్తున్నాడన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఏకతాటిపై నిలబడిందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

Also Read: justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం


మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. ఉగ్రవాదులతో జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు సైనికు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గత 36 రోజులుగా ఉగ్రవాదదాడులు వరుసగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మోదీ ప్రభుత్వం ప్రతీ దానిని వ్యాపారాత్మక ధోరణితో చూస్తుందన్నారు. అందులో మాత్రం మార్పు రావడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. జమ్ము ప్రాంతంలో ఈ తరహా ఘటనలు ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 03:25 PM

Advertising
Advertising
<