Delhi: వయనాడ్ నుంచి రాహుల్ లోకసభ నామినేషన్ నేడు..
ABN, Publish Date - Apr 03 , 2024 | 10:34 AM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్ సభ సమరానికి సిద్ధం అయ్యారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇది ఆయన ఎన్నికల ప్రయాణంలో కీలకమైన ముందడుగు. నామినేషన్ సమర్పణకు ముందు రాహుల్.. కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారు.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్ సభ సమరానికి సిద్ధం అయ్యారు. బుధవారం ఆయన కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి తన నామినేషన్‌ని దాఖలు చేయనున్నారు. ఇది ఆయన ఎన్నికల ప్రయాణంలో కీలకమైన ముందడుగు. నామినేషన్ సమర్పణకు ముందు రాహుల్.. కల్పేట పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహిస్తారు.
వయనాడ్ లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో కాంగ్రెస్, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(UDF) కార్యకర్తలు రోడ్ షోలో పాల్గొననున్నారు. రోడ్‌షో తరువాత, రాహుల్ గాంధీ తన నామినేషన్ పత్రాలను వయనాడ్ జిల్లా కలెక్టర్ రేణు రాజ్‌కి కల్పేటలోని ఆమె కార్యాలయంలో అధికారికంగా సమర్పించనున్నారు. రాహుల్ వెంట కేపీసీసీ అధ్యక్షుడు కె సుధాకరన్ పార్టీ సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, పీకే కున్హాలికుట్టి తదితర నేతలు ఉంటారు.
Congress: 33 ఏళ్ల ప్రస్థానానికి తెర.. రాజ్యసభ నుంచి మన్మోహన్ పదవీ విరమణ.. ఆయన గురించి ఇవి పక్కా తెలుసుకోవాలి
కేరళలో ఎన్నికలు..
ఏప్రిల్ 26న జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కేరళ సిద్ధమవుతోంది. మొత్తం 20 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి సీపీఐ నేత అన్నీ రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ల నుంచి గట్టి పోటీ ఉండనుంది. 2019 ఎన్నికలలో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి అద్భుతమైన విజయం సాధించారు. అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే సీపీఐ నేత అన్నీ రాజాపై పోటీ చేయాలన్న రాహుల్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి పినరయి విజయన్ వ్యతిరేకిస్తున్నారు.
బీజేపీ విమర్శ
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె సురేంద్రన్ రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాహుల్ నియోజకవర్గ ప్రజల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయాలను హీటెక్కించాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 03 , 2024 | 10:34 AM