ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sam Pitroda: రాహుల్ పప్పు కాదు.. ఆయనలో క్వాలిటీస్ చెప్పిన శామ్ పిట్రోడా

ABN, Publish Date - Sep 09 , 2024 | 12:22 PM

శామ్ పిట్రోడా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తీరు బీజేపీ ప్రచారం చేసే దానికి విరుద్దంగా ఉందన్నారు. తమ నేత పప్పు కాదని..

Sam Pitroda

రాహుల్ గాంధీ మూడురోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు ఇండియన్ ఓవర్‌సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా ఉన్నారు. టెక్సాస్‌లోని ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో శామ్ పిట్రోడా రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తీరు బీజేపీ ప్రచారం చేసే దానికి విరుద్దంగా ఉందన్నారు. తమ నేత పప్పు కాదని.. ఉన్నత విద్యావంతుడని తెలిపారు. కోట్ల రూపాయిలు ఖర్చుచేసి బీజేపీ చేస్తున్న ప్రచారానికి విరుద్దంగా రాహుల్ గాంధీ విజన్ ఉందన్నారు. రాహుల్ గాంధీ పప్పు కాదని, బాగా చదువుకున్నారని అన్నారు. ఏదైనా విషయంపై లోతైన ఆలోచన కలిగిన వ్యూహకర్తగా రాహుల్‌ గాంధీని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని పిట్రోడా తెలిపారు. తాము నేర్చుకున్న విషయాల్లో గాంధేయవాద ఆలోచనలు, వైవిధ్యం ఎంతో ప్రధానమైనవని పిట్రోడా తెలిపారు. 1950ల కాలంలో పాఠశాలకు వెళ్లినప్పుడు, గాంధేయ ఆలోచనలు తమ అభ్యాసానికి ప్రధానమైనవని అన్నారు. వైవిధ్యం అనేది కేవలం పదం మాత్రమే కాదని జీవనశైలి అని పిట్రోడా పేర్కొన్నారు. జాతి, మతం, భాష లేదా ప్రాంతంతో సంబంధం లేకుండా మన ప్రజలను గౌరవించేలా చూసుకోవడమే భిన్నత్వంలో ఏకత్వం ప్రధాన ఉద్దేశమన్నారు.

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


రాహుల్ ఎజెండా ఇదే..

రాహుల్ గాంధీ ఎజెండా వైవిధ్యమేనని పిట్రోడా తెలిపారు. రాహుల్ గాంధీకి భిన్నమైన ఎజెండా ఉందని.. దానిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదన్నారు. ప్రజలను కలపడం, వారి అభిప్రాయాలను గౌరవించడం రాహుల్ గాంధీ ఎజెండాగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అనేది సులభమైన పని కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవల్సిన బాధ్యత దేశ ప్రజలపైనే ఉందని పిట్రోడా తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే వ్యక్తులు ఉన్నంతవరకు ప్రజాస్వామ్య పరిరక్షణను తేలికగా తీసుకోలేమన్నారు. గాంధీ, నెహ్రూ, మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకులు స్వేచ్ఛ అంటే ఏమిటో స్పష్టంగా చెప్పారని, వాళ్లంతా ఎలాంటి దేశాన్ని నిర్మించాలనుకున్నారో ఈ దేశ ప్రజల ముందుందన్నారు. స్వేచ్ఛా భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్‌లో చేరాలని శ్యామ్ పిట్రోడా పిలుపునిచ్చారు.

Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల


అమెరికాలో రాహుల్‌కు డిమాండ్..

రాహుల్ గాంధీకి అమెరికాలో ఎంతో డిమాండ్ ఉందని శామ్ పిట్రోడా తెలిపారు. రాహుల్ గాంధీ చివరిసారి న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రధాన సమావేశంలో పాల్గొన్నప్పుడు డల్లాస్‌కు రావాలని డిమాండ్ వచ్చిందని, తన తదుపరి పర్యటనలో డల్లాస్‌కు వస్తానని వారికి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ డల్లాస్‌లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.


National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 12:29 PM

Advertising
Advertising