Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు
ABN, Publish Date - Jul 30 , 2024 | 02:06 PM
జార్ఖండ్‌లో రైలు ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీలు కాస్తా ఘాటుగా స్పందించాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లక్ష్యంగా చేసుకుని ఆ యా పార్టీలోని కీలక నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.
న్యూఢిల్లీ, జులై 30: జార్ఖండ్‌లో రైలు ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీలు కాస్తా ఘాటుగా స్పందించాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లక్ష్యంగా చేసుకుని ఆ యా పార్టీలోని కీలక నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.
Also Read: Jaya Amitabh Bachchan: సభలో జయా బచ్చన్ ‘అసహనం’
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక...
శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. రైలు ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయన్నారు. అయితే ఈ ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే.. మోదీ ప్రభుత్వానిది అవమానకరమైన ఉదాసీనతగా ఎంపీ ప్రియాంక పేర్కొన్నారు. ఇప్పటి వరకు చాలా రైలు ప్రమాదాలు జరిగాయని ఈ సందర్భంగా ఎంపీ ప్రియాంక గుర్తు చేశారు.
Also Read: Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి
కానీ నేటికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లో మాత్రం జవాబుదారీతనం కనిపించడం లేదన్నారు. ఇలా తరచు రైలు ప్రమాదం చోటు చేసుకోవడం.. అలా నష్ట పరిహారం ప్రకటించడం.. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయిస్తామని పేర్కొడనడం.. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పీఆర్ రీల్ అప్ లోడ్ చేసుకుంటారంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యవహార శైలిని ఎండగట్టారు. ఈ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రీల్ మంత్రి అంటూ అభివర్ణించారు.
Also Read: Jharkhand train accident: ఇదా నా పాలన.. మోదీ ప్రభుత్వానికి చురకలంటించిన సీఎం మమత
రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి పోతున్నాయని.. ఆ క్రమంలో ప్రయాణికులు మరుగుదొడ్లలో కూర్చుని ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ తరహా ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి మాత్రం సిగ్గని పించడం లేదన్నారు. జార్ఖండ్‌లోని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీ సైతం దాదాపుగా ఇదే తరహా ఆరోపణలు సంధించింది.
Also Read: Karnataka: సీఎంకు వ్యతిరేకంగా పాదయాత్ర.. అనుమతి ఇవ్వని సర్కారు
ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ..
ఇక సమాజవాదీ ఎంపీ అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వ హయాంలో రికార్డు స్థాయిలో పేపర్ల లీకులు జరిగాయన్నారు. అలాగే అదే స్థాయిలో రైలు ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఇన్ని ప్రమాదాలు జరిగినా.. ఇంత మంది ప్రాణాలు పొగోట్టుకొంటున్నా.. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైలు ప్రమాదాల్లో.. రైల్వే భద్రతలో మాత్రం ఈ ప్రభుత్వం ట్రాక్ రికార్డు సృష్టించిందంటూ మోదీ ప్రభుత్వానికి సుతిమెత్తగా చురకలంటించారు.
Also Read: Jharkhand: పట్టాలు తప్పిన ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు
టీఎంసీ నేతలు..
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుస్మిత దేవ్, సాగరిక ఘోష్‌లు సైతం స్పందించారు. రైలు ప్రమాదాలపై జవాబుదారీతనంలో రైల్వే మంత్రిత్వ శాఖది శూన్యమన్నారు. అలాగే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ జవాబుదారీతనం సైతం శూన్యమని వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ తరహా ప్రమాదం జరిగినా? కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం సమాధానం అయితే ఉండదన్నారు. ఇంకా ఇటువంటి ఎన్ని రైలు ప్రమాదాలు జరిగితే.. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందోనని వారు సందేహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం జవాబుదారీతనంతోపాటు బాధ్యతల నుంచి తప్పించుకోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
Also Read: President Murmu: ఆగస్టు 5 నుంచి రాష్ట్రపతి విదేశీ పర్యటన
Read More National News and Latest Telugu News
Updated Date - Jul 30 , 2024 | 02:12 PM