ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vande Bharat Sleeper Coaches: వందే భారత్ స్లీపర్ కోచ్‌లను రిలీజ్ చేసిన మంత్రి.. వీటి స్పెషల్ ఏంటంటే..

ABN, Publish Date - Sep 01 , 2024 | 06:55 PM

భారతీయ రైల్వేలు ఇప్పుడు సెమీ హై స్పీడ్ వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం (సెప్టెంబర్ 1) వందే భారత్ స్లీపర్ రైలు మొదటి మోడల్ ప్రోటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

Vande Bharat Sleeper Coaches

దేశంలో త్వరలోనే స్లీపర్(Vande Bharat Sleeper Coaches) వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైలు దేశంలోని వివిధ రైల్వే మార్గాల్లో ప్రయాణించనుంది. ఈ క్రమంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(ashwini vaishnav) నేడు(సెప్టెంబర్ 1న) బెంగళూరులోని ప్రొడక్షన్ యూనిట్‌ని సందర్శించి అక్కడ వందే భారత్ స్లీపర్ ట్రైన్ సెట్ ఉత్పత్తిని పరిశీలించారు. ఆ క్రమంలో బీఈఎంఎల్ ఫెసిలిటీలో వందే భారత్ స్లీపర్ కోచ్‌కు సంబంధించిన ప్రోటోటైప్ వెర్షన్‌ను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కోచ్‌ల గురించి కీలక విషయాలను వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైలు రూపకల్పన, లోపలి భాగం చాలా ఆకర్షణీయంగా ఉందని, అందులో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ప్రయాణీకులకు అందించబడుతున్నాయని తెలిపారు.


సౌకర్యాలు, సెఫ్టీ

వందే భారత్ స్లీపర్ రైలు.. సౌకర్యం, భద్రత, సామర్థ్యం పరంగా కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుందని రైల్వే మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ రైలులో యుఎస్‌బీ ఛార్జింగ్, పబ్లిక్ ప్రకటనలు, దృశ్య సమాచార వ్యవస్థ, ఇన్‌సైడ్ డిస్ప్లే ప్యానెల్లు, సెక్యూరిటీ కెమెరాలు, మాడ్యులర్ ప్యాంట్రీతోపాటు ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్లు ఉన్నాయి. ఇంకా వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక బెర్త్‌లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. మొదటి AC కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణికులకు హాట్ వాటర్ షవర్ సౌకర్యం కూడా అందించబడుతుంది.


వందే భారత్ స్లీపర్ రైలులో ఉన్న సౌకర్యాలు

  • ప్రయాణీకుల భద్రత కోసం రైలు సెట్లలో ప్రమాద నిరోధక ఫీచర్లు

  • GFRP ప్యానెల్స్‌తో క్లాస్ ఇంటీరియర్‌

  • ఏరోడైనమిక్ బాహ్య రూపం

  • మాడ్యులర్ చిన్నగది

  • వికలాంగులకు ప్రత్యేక బెర్త్‌లు, మరుగుదొడ్లు

  • ఆటోమేటిక్ తలుపులు

  • సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్

  • చివరి గోడపై రిమోట్‌గా పనిచేసే ఫైర్ బారియర్ తలుపులు

  • లోకో పైలట్ కోసం టాయిలెట్

  • ఫస్ట్ క్లాస్ ACలో వేడి నీటి షవర్లు

  • USB ఛార్జింగ్ సదుపాయంతో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్

  • బహిరంగ ప్రకటన, దృశ్య సమాచార వ్యవస్థ

  • పెద్ద లగేజీ సౌకర్యం గది


ఛార్జీలు

వందేభారత్ రైలు డిజైన్‌ను మెరుగుపరుస్తున్నామని, అనుభవాల నుంచి నేర్చుకుని దాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. వందేభారత్ మెట్రోకు కూడా ఇదే సూత్రాన్ని అవలంబిస్తామని అశ్విని వైష్ణవ్ అన్నారు. 16 కోచ్‌లతో కూడిన వందే భారత్ స్లీపర్ రైలు 800 నుంచి 1200 కి.మీ ప్రయాణిస్తుందన్నారు. ఈ రైలులో ఆక్సిజన్ స్థాయిలు, వైరస్ రక్షణ వంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయన్నారు. ఈ రైలు మధ్యతరగతి ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీని ఛార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయన్నారు. తదుపరి పరీక్షల కోసం ఈ రైలు ట్రాక్‌లోకి తీసుకెళ్లడానికి ముందు 10 రోజుల్లో పరీక్ష చేయించుకోవాలని కేంద్ర మంత్రి అధికారులకు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు.


మూడు వెర్షన్లు

వందే భారత్ రైలులో మూడు వెర్షన్లు ఉన్నాయి. చైర్ కార్, స్లీపర్, మెట్రో. ఇప్పటివరకు ప్రభుత్వం వందే భారత్ రైళ్లకు చైర్ కార్ వెర్షన్‌ను ప్రారంభించింది. వందేభారత్ స్లీపర్ కోచ్ నిర్మాణాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ వందే భారత్ స్లీపర్ కోచ్‌ల దృష్టి ప్రయాణికుల సౌకర్యాలపైనే ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. ముందుగా ఐదు నుంచి ఆరు నెలల పాటు ట్రైన్‌సెట్‌ను పరీక్షిస్తామని, ఆ తర్వాతే ప్రారంభిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్లీపర్ రైలు కూడా చైర్ కార్ మాదిరిగానే అదే సాంకేతికతపై ఆధారపడి ఉంటుందన్నారు. కాబట్టి ఇది శబ్దం లేని ప్రయాణాన్ని అందిస్తుందన్నారు.


ఇవి కూడా చదవండి:

TMC: టీఎంసీకి ఎదురుదెబ్బ.. అసోం పార్టీ అధ్యక్షుడు రాజీనామా

Next Week IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలివే.. షేర్ మార్కెట్‌లో మనీ సంపాదించే ఛాన్స్

ITR Refund: ఐటీఆర్ రీఫండ్ ఇంకా వాపసు రాలేదా.. అయితే ఇలా చేయండి


Telegram: మరికొన్ని రోజుల్లో టెలిగ్రామ్ యాప్ బ్యాన్?.. కారణాలివేనా..

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 01 , 2024 | 06:57 PM

Advertising
Advertising