Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లు వచ్చేస్తున్నాయి.. ప్రారంభం ఎప్పుడంటే..
ABN, Publish Date - Jun 15 , 2024 | 08:23 PM
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందేభారత్ ఏసీ చైర్‌కార్ రైళ్లు అందుబాటులోకి రాగా.. తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. గత కొంతకాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. మరో రెండు నెలల్లోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయనుందన్నారు. మరోవైపు వెయిటింగ్ లిస్ట్ సిస్టమ్‌కు పరిష్కారం కోసం రైల్వే శాఖ ప్రయత్నిస్తోందన్నారు. రైళ్ల సంఖ్య, బెర్తుల సంఖ్య పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ సమస్య పరిష్కారమవుతుందన్నారు. మరో 60 రోజుల్లోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Uddhav Thackeray: నన్ను వీడి వెళ్లిన వాళ్లను మాత్రం... తెగేసి చెప్పిన ఉద్ధవ్ థాకరే
అంతా సిద్ధం..
వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయడానికి సిద్ధంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ఈ రైళ్ల కోసం రెండు ప్రత్యేక ట్రాక్‌లను సిద్ధం చేశామన్నారు. ఈ రెండు ట్రాక్‌లపై ట్రయల్స్ పూర్తైన తర్వాత ప్రయాణీకులకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులో రానున్నట్లు తెలిపారు. ప్రయోగ దశలో నాలుగు స్లీపర్ క్లాస్ కోచ్‌లతో రైలును సిద్ధం చేసినట్లు తెలిపారు.రానున్న ఐదేళ్లలో సుమారు 400 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు.
Indira Mother of India: ఇందిరాగాంధీని 'మదర్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన కేంద్ర మంత్రి సురేష్ గోపి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Jun 15 , 2024 | 08:23 PM