Rains: తీవ్రరూపం దాల్చనున్న అల్పపీడనం.. 6 జిల్లాలకు భారీ వర్ష సూచన
ABN, Publish Date - Dec 18 , 2024 | 09:46 AM
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఈ నెల 20వతేదీ వరకు చెన్నై సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
- చెన్నై సహా 6 జిల్లాలకు భారీ వర్ష సూచన
చెన్నై: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, దీని ప్రభావంతో ఈ నెల 20వతేదీ వరకు చెన్నై(Chennai) సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో దక్షిణ, డెల్టా జిల్లాల్లో వారం రోజుల నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, ఆనకట్టలు పూర్తిస్థాయిలో నిండాయి.
ఈ వార్తను కూడా చదవండి: R. Radhakrishnan: కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు ప్రభుత్వ సంస్థల్లోనే..
దీంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి, ఆరుతడి పంటలు నీటి పాలైనాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతం మధ్య తీరంలో కేంద్రీకృతమైందని, ఇది గురువారానికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం ఉదయం 5 గంటలకు ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించిందని,
రానున్న మూడు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తాజాగా ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువారూర్, నాగపట్నం(Chennai, Tiruvallur, Kanchipuram, Thiruvarur, Nagapattinam), చెంగల్‌పట్టు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
చేపల వేటకు వెళ్లొద్దు
దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరో 48 గంటల్లో బలపడి సముద్రతీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించనున్నదని తమిళనాడు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో బలమైన అల్పపీడనంగా రూపుదిద్దుకుంది.
ఈ అల్పపీడనం పడమర, వాయువ్య దిశగా సముద్రతీర ప్రాంతాల వైపు కదులుతోందని, ఇప్పటికే దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలపై ఉండటం వల్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. తీర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని, ఈ క్రమంలో పుదుచ్చేరి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈవార్తను కూడా చదవండి: Youth Addiction : మృత్యు వలయం
ఈవార్తను కూడా చదవండి: బీఆర్ఎస్ నేతలకు సవాల్, చర్చకు సిద్ధమా..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: లగచర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలి
Read Latest Telangana News and National News
Updated Date - Dec 18 , 2024 | 09:46 AM