ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: బలపడుతున్న ఈశాన్య రుతుపవనాలు.. 21 జిల్లాలకు అలెర్ట్‌

ABN, Publish Date - Nov 16 , 2024 | 11:00 AM

రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడుతున్నాయి. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియా సముద్రంపై బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ 21 జిల్లాలకు హెచ్చరిక చేసింది.

- మూడు జిల్లాల్లో కుండపోత వర్షం

చెన్నై: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడుతున్నాయి. దీనికితోడు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియా సముద్రంపై బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ 21 జిల్లాలకు హెచ్చరిక చేసింది. కన్నియాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురిసింది. ఈశాన్య రుతుపవనాలు మరింతగా బలపడటంతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: ఓ కీలక సదస్సుకు ప్రధాని మోదీ.. ఏపీ సీఎం చంద్రబాబు


ఇదిలావుండగా నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ అరేబియా సముద్రంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడివుందని దాని కారణంగా అనేక జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా చెన్నై, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విలల్లుపురం, కడలూరు, మైలాడుదురై, నాగపట్టణం(Kaddalore, Mylapore, Nagapattinam), తంజావూరు, తిరువారూర్‌, పుదుక్కోట, రామనాథపురం జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. రాణిపేట, కల్ళకుర్చి, శివగంగై, అరియలూరు, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి, తూత్తుక్కుడి, కన్నియాకుమారి జిల్లాలకు చెన్నై వాతావారణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.


గురువారం రాత్రి నుంచి..

చెన్నై నగరం, పరిసర ప్రాంతాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వేకువజాము వరకు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కన్నియాకుమారి జిల్లాలో గత నెల రోజులుగా విస్తారంగా వర్షా లు కురుస్తున్నాయి. గురువారం కూడా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నాగర్‌కోయిల్‌తో పాటు అనేక గ్రామాల్లో శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది.

దీంతో ప్రజాజీవనానికి అంతయారం ఏర్పడింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. కన్నియాకుమారి సముద్ర తీర గ్రామా ల్లో కూడా భారీ వర్షం కురవడంతో సముద్రతీర ప్రాంతం పర్యాటకుల లేక బోసిపోయింది. జిల్లాలోని పేచ్చిపారై, పెరుంజాణి, సిట్రా రు డ్యామ్‌ సహా కొండ ప్రాంత గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. పెరుంజాణి డ్యామ్‌ నీటిమట్టం 65.68 అడుగులకు చేరుకుంది.


భవానీ సాగర్‌కు వరద ముప్పు ..

ఈరోడ్‌ జిల్లాలో గురువారం ఉదయం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు జరి గింది. ఈరోడ్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉద యం నుంచి వర్షపు చినుకులు ప్రారంభం కాగా, అనేక ప్రాంతాల్లో రాత్రి కూడా వర్షం కురిసింది. భవానీ సాగర్‌, దానిపరిసర ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. భవానీ సాగర్‌లో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.


నెల్లై, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షం...

తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో కూడా శుక్రవారం భారీ వర్షం కురిసింది. నెల్లై జిల్లాలోని రాధాపురంలో గరిష్టంగా 19 మిల్లీమీటర్లు, అంబైలో 13 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. తూత్తుక్కుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. తిరుచ్చెందూరులో 6 మిమీ, కులశేఖరపట్టణంలో 5 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.


ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌ ఓ రాబందు..

ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2024 | 11:01 AM