ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rains: గంటపాటు కుండపోత..

ABN, Publish Date - Oct 31 , 2024 | 11:16 AM

రాజధాని నగరం చెన్నై(Chennai)లో రెండు రోజలపాటు ఎండవేడితో అవస్థలు పడిన నగరవాసులు బుధవారం ఉదయం హఠాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి ఊరట చెందారు. ఈ వర్షానికి నగరమంతటా చల్లటివాతావరణం నెలకొంది. అయితే కుండపోత వర్షంతో టి.నగర్‌, నుంగంబాక్కం వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు.

- అన్నానగర్‌లో 9 సెం.మీ.ల వర్షం

- కొద్దిపాటి వర్షానికే కొన్ని ప్రాంతాలు జలమయం

చెన్నై: రాజధాని నగరం చెన్నై(Chennai)లో రెండు రోజలపాటు ఎండవేడితో అవస్థలు పడిన నగరవాసులు బుధవారం ఉదయం హఠాత్తుగా కురిసిన కుండపోత వర్షానికి ఊరట చెందారు. ఈ వర్షానికి నగరమంతటా చల్లటివాతావరణం నెలకొంది. అయితే కుండపోత వర్షంతో టి.నగర్‌, నుంగంబాక్కం వంటి ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. బుధవారం ఉదయం 8 నుండి 12 గంటల వరకు భానుడు భగ్గుమన్నాడు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. సన్నటి జల్లులతో ప్రారంభమైన వర్షం కుండపోతగా మారింది.

ఈ వార్తను కూడా చదవండి: GST Scam: జీఎస్టీ స్కాంలో జర్నలిస్టుకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత


మనలి, తిరువొత్తియూరు, తండయార్‌పేట, వాషర్‌మెన్‌పేట, రాయపురం, మింట్‌, ప్యారీస్‌ కార్నర్‌, ట్రిప్లికేన్‌, రాయపేట, మైలాపూరు, నుంగంబాక్కం, అంబత్తూరు, విల్లివాక్కం, పాడి, కొరట్టూరు, అన్నానగర్‌, మధురవాయల్‌, కోయంబేడు(Koyambedu), వలసరవాక్కం పూందమల్లి, తాంబరం, గిండి, నుంగంబాక్కం, రెడ్‌హిల్స్‌, సైదాపేట తదితర ప్రాంతాల్లో గంటకు పైగా భారీ వర్షం కురిసంది.


ఈ వర్షానికి పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అన్నానగర్‌ ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 9 సెం.మీ.ల వర్షపాతం నమోదైందని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే విధంగా మనలి, కొళత్తూరు, పెరంబూరు, అమింజికరై, మధురవాయల్‌ ప్రాంతాల్లో 6 సెం.మీ.ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.


15 జిల్లాలకు వర్షసూచన..

మన్నార్‌ జలసంధి ప్రాంతం, పడమటి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా గురువారం 15 జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశాముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిండుగల్‌, మదురై, తిరుచ్చి, కరూరు(Dindugal, Madurai, Trichy, Karur), నామక్కల్‌, సేలం, ఈరోడ్‌, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, వేలూరు, తిరువణ్ణామలై, కళ్ళకురిచ్చి, అరియలూరు తదితర జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురుస్తుందని తెలిపారు. చెన్నై నగరంలో గురువారం ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 11:16 AM