Rajasthan: మాజీ సీఎం కాన్వాయ్‌కు ప్రమాదం...పలువురు పోలీసులకు గాయాలు
ABN, Publish Date - Dec 22 , 2024 | 08:29 PM
పోలీసు వాహనానికి అడ్డంగా మోటార్ సైకిల్ రావడంతో ప్రమాదాన్ని తప్పించే క్రమంలో పోలీసు వాహనం బోల్తాపడింది. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
పలీ: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే (Vasudhara Raje) కాన్వాయ్‌లోని ఓ పోలీసు వాహనం ఆదివారంనాడు ప్రమాదానికి గురైంది. దీంతో ఏడుగురు పోలీసులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసు వాహనానికి అడ్డంగా మోటార్ సైకిల్ రావడంతో ప్రమాదాన్ని తప్పించే క్రమంలో పోలీసు వాహనం బోల్తాపడింది. మాజీ మంత్రి ఓటారామ్ దేవాసి తల్లి మరణించడంతో ఆయనను పరామర్శించేందుకు వసుంధరా రాజే వెళ్తుండగా పలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కారులో ఏడుగురు పోలీసులు ప్రయాణిస్తున్నారని, వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయని పలీ ఎస్పీ చునా రామ్ జాట్ తెలిపారు.
Rahul Gandhi: పర్భాని హింసాకాండ బాధితులను పరామర్శించనున్న రాహుల్
''ముంబై నుంచి జోథ్‌పూర్‌కు తిరిగి వస్తుండగా వెనుకగా వస్తున్న పోలీసుల జీపు బోల్తా పడింది. పోలీసులు రూపారామ్, భాగ్‌చంద్, సూరజ్, నవీన్, జితేంద్ర గాయపడ్డారు. వారిని తక్షణం అంబులెన్స్‌లో పలీ ఆసుపత్రి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని వసుంధరా రాజే ఒక ట్వీట్‌లో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Arvind Kejriwal: మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన రిజిస్ట్రేషన్ ఎప్పట్నించంటే
Delhi: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు
Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..
For National News And Telugu News
Updated Date - Dec 22 , 2024 | 08:29 PM